ప్రాచీనత- అనేది, ప్రపంచములోని అన్ని దేశాల నాగరికతా వికాసమునకు తీపి గుర్తులు.
అందుకే ప్రపంచ దేశాలలోని ప్రజలు
తమ తమ ప్రాచీన జ్ఞాపకాలను పదిలపరుచుకోవడములో ఉత్సాహాన్ని కలిగిఉంటారు.
ఆ అంశాలు, చరిత్ర, భాష, ఆదర్శమూర్తులైన వ్యక్తులు,
సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాది కళలు, వివిధ వస్తువుల గురించీ .....
ఏదైనా కావొచ్చును.
గోవాలో ఒక బావి వద్ద మహిళ బొమ్మ కూర్చుని ఉన్న విచిత్ర దృశ్యం ఉన్నది.
ఒక స్త్రీ మూర్తి బొమ్మ, బావి ఎదుట ఉన్నది.
నీలం చీర, ఎర్ర జాకెట్టు ధరించిన ఆ వనిత- ఒక ప్లాట ఫారం పైన ఆసీన ఐ ఉన్నది.
బావి- యొక ప్రాచీనతకు- విశదీకరించే పద్ధతిలో ఈ శిల్పాన్ని - అక్కడ ఉంచి ఉంటారు.
నా ఊహ నిజమైతే- ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్న్ని
అనుసరించాల్సిన ఆవశ్యకత ఉన్నది.
మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక సత్రాలూ, మంచినీటి బావులూ- కనుమరుగై పోతున్నవి.
(ఈనాడు హోటళ్ళు అనేక రెస్టరెంట్లు -
ఈ లోటుని భర్తీ చేస్తునాయి అనుకోండి, ఫర్వాలేదు)
మనకి సంఘానికి మేలు కలిగించే- త్రాగు నీటి వనరులు, భోజన సదుపాయాలను
యాత్రికులకు సమకూర్చే ధర్మ సత్రాలు వంటి వాటికి,
వాని ప్రాచీనతకు ప్రతీకలుగా- ఇలాగ శిల్పాలు వగైరాలను-
నిలిపి ఉంచడం మేలు కదా!
అఫ్కోర్స్! చెరువులు, నదులకూ సైతం ముప్పు వాటిల్లుతూన్న
నేటి నేపథ్యంలో వాపీ. కూప, తటాకము భద్రతలకై
మన ఘోష, గోల, గగ్గోలు అనవసరమని- అంటున్నారా?
హ్హూ.....! అదీ నిజమేనేమో!
ఐతే గంగా నదీ పరిరక్షణా కార్యక్రమాలకు- కొంచెం కొంచెం కదలికలు-
మన ప్రజా ప్రభుత్వం వారిలో ఏర్పడుతున్నవి కదా!
ఈ మాత్రం ఆశావహ దృక్పథం పొరబాటు కాదు కదా!
**************
రావల్ నాథ్/ భూత నాథ్
(Vetoba | Ravalnath | Bhootnath) కోవెల సీమలో వద్ద ఉన్నది ఈ బావి.
No comments:
Post a Comment