Monday, January 30, 2012

తెలుగు నదుల సందడి



జాతర! జాతర! జాతర! ;
గలగలల జాతర! ||

గోదారి, క్రిష్ణ వేణి, గంగమ్మ ఉరకలు
గౌతమీ కిన్నెరల కెరటాల తీవెలపై
వీణా గానములను వినిపించుము! వెన్నెలా! ||

తుంగభద్రా ఝరిలో జలకాలు ఆడుతూ
ముచికుందా కెరటాల మురిపాల సాగుతూ
ఉర్వికి వేంచేయండి ప్రాగ్ ఉదయ కిరణమ్ములార!

నాగావళి, పినాకినీ వాహినీ పద ముద్రల
గగన నీలిమలు శోభిలు నర్తనములు సేయగా
ప్రకృతియై తనరండీ సకల సౌందర్యాలూ!  ||

రాధా కృష్ణ చలనములు ఇతిహాసములు


chalanamulu itihAsamulu

రాధా కృష్ణుల చైతన్యం
ప్రతి చలనం ఒక ఇతిహాసం ||

అద్దరి ఇద్దరి యమునా ఝరికి ;
కదిలే అలలకు గురువులైనవి;
ఇరువురి జల ప్రతి బింబాలు;
రాధా కృష్ణుల చైతన్యం  
ప్రతి చలనం ఒక ఇతిహాసం ||  

మీ, క్రిష్ణ రాధికా బోధనల
అలలు నేర్చినవి
కదన కుతూహల రాగములు
రాధా కృష్ణుల చైతన్యం
ప్రతి చలనం ఒక ఇతిహాసం ||

శశి బింబముల వెన్నెలకబ్బెను
కథా కథనముల చాతుర్యం
ప్రకృతి మోవికి అద్దినది సుందర దరహాసం
రాధా కృష్ణుల చైతన్యం
ప్రతి చలనం ఒక ఇతిహాసం ||
;

Sunday, January 29, 2012

వృక్ష మహిమ



;
మన హిందూ జ్యోతిష్యశాస్త్రానికీ, ఖగోళశాస్త్రానికీ అవినాభావ సంబంధం ఉన్నది.
అలాగే ఆయుర్వేద వైద్య విధానానికీ,ప్రకృతికీ కూడా!
ఈ సంప్రదాయమే “అహింసా విధానానికి” మూలస్తంభం గా నిలిచినది.
అందువలననే దేవాలయాలలో హిందూదేవ, దేవతా మూర్తులకు,
అనుసంధానంగా వాహనము బొమ్మ,
అలాగే ప్రతి గుడిలోనూ కనీసం ఒక చెట్టు-
స్థల వృక్షము సిద్ధాంత నిబంధనలతో ఉంటూన్నవి.
చెట్లు కొట్టేస్తూ, అడవులకు చేటు తెస్తూన్న
మానవుని స్వార్ధపరత్వం పర్యావరణానికి కలిగిస్తూన్న అపకారం ఎంతో-
అంచనాలకు అందనిదని,
అటు ప్రకృతిప్రేమికులూ, ఇటు వాతావరణ సైంటిస్టులూ ఘోష పెడ్తూనేఉన్నారు.
“వృక్షో రక్షతి రక్షితః” –
ధరణీ ప్రేమికులందరూ జపిస్తూనే ఉన్న
ఈ “వృక్షో రక్షతి రక్షితః” గొప్ప మంత్రము.

**********************************

స్థలములకూ, జాగాలకూ అపరిమిత డిమాండు ఏర్పడింది.
అందునా ఆంధ్ర ప్రదేశ్ రాజధానిలో మిన్ను తాకే ధరలు!!!!!
ఇలాటి పరిస్థితులలో మేడ్చల్ లో సాయిగీత ఆశ్రమము స్థాపించబడింది.
ఇక్కడ ఆయుర్వేద, ఖగోళ, చాంద్రమాన మూలసూత్రాలను
ప్రాతిపదికగా తీసుకుని వృక్షాలను పెంచుతున్నారు.
అవి కల్పవృక్షములు, దేవతావృక్షములు.
వీనిని “ధన్వంతరీ వృక్షములు” అని పిలుస్తున్నారు.
ఆశ్రమ నిర్వాహకులు “వృక్ష మహిమ” అనే పుస్తకమును అచ్చు వేసారు.
ఆశ్రమ సిద్ధాంతములు, ధ్యేయ, లక్ష్య, నియమాదులను
యావన్మందీ తెలుసుకోవడానికి ఈ పొత్తము ఉపకరిస్తుంది.

**********************************

“వృక్ష మహిమ” 203 పేజీలతో, కన్నులకు
ఏ మాత్రమూ శ్రమ లేకుండా చదివేటట్లుగా చక్కని ముద్రణతో వెలువడింది.
ఇందులో ఉన్న అనేక వివరములు;

విషయసూచిక:-

సాయిగీత ఆశ్రమము స్థాపన
ప్రకృతిలో చెట్లు, వాటి మహిమ
మహిమాన్విత వృక్షాలు
భక్తుల అనుభవాలు
పుట్టిన వారం అనుసరించి
ప్రత్యేక చెట్టును పూజించే వివరములు
వృక్షదేవతల నామావళి
శ్రీ సాయి నామావళి
శ్రీ వినాయక (విఘ్నేశ్వర) నామావళి
శ్రీ ఆంజనేయ; శ్రీ గరుడ నామావళి
అభయ మూర్తుల క్షేత్రము
గరుడ క్షేత్రము
ఆశ్రమ వైద్య కార్యకలాపాలు
ఆశ్రమములో జరిగే పండుగలు
ఆశ్రమ ప్రచురణలు

ఇలాగ అనేక వివరములతో పాటు
“పూజ్య సద్గురుగారి దివ్యవాక్కులు” భక్తులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నవి.

**********************************
;
;
” శివానంద లహరి”లో అయస్కాంతము చెట్టు ను గురించి
61 శ్లోకమును ఈ పుస్తమునకు (వృక్ష మహిమ)
మొదటి పుటలలో స్వీకరించారు. ఆ శ్లోకము:-

అంకోలం నిజ బీజ సంతతిః – అయస్కాంతో ఫలం సూచికా |
సాధ్వీ నైజ విభుం, లతాక్షతిరూహం, సింధుస్సరి ద్వల్లభమ్|
ప్రాప్నోతీహ యధా తధా పశుపతేః పాదారవిందద్వయమ్|
చేతోవృత్తిః రూప్యేత్యతిష్ఠతి సదా సా భక్తిరుచ్యతే|

తాత్పర్య భావము:- మనోవృత్తి పరమాత్మను వదలకుండినచో
అదే “భక్తి” అని వక్కాణము.

అమోఘ ప్రతిభాశాలి శ్రీ ఆది శంకరాచార్య రచించిన “శివానంద లహరి” లోని
61 వ శ్లోకం ఇది. అంకోలం విత్తనములు తన మాతృ వృక్షమునకు అతుక్కుంటాయి.
ఆ వృక్షమునకు గల ఇనుము వంటి గుణము కల
ఆ చెట్టు ముళ్ళకు అయస్కాంతము పట్ల ఆకర్షిత గుణమును కలిగి ఉన్నాయి
లతలు/ తీగ- పాదపము యొక్క మ్రాను చుట్టూతా పెనవేసుకుంటుంది.
నది సముద్రములో కలుస్తుంది.
పశుపతి నాధుని, మహేశుని చరణ పద్మములకు
భక్తి భావనలు లీనమౌతాయి.” అంటూ
శ్రీ కంచి పీఠాధిపతి ఈ మహత్తర శ్లోకానికి వివరణను ఇచ్చారు.

ఇలాగ – ఊడుగ చెట్టు అనగా అంకోలం తరువును గురించిన
ప్రస్తావన ఉన్నది. ” Eranzhil tree / azhinjil (Tamil) /
అంకోలం చెట్టు Kanchi Mahaperiyavar,
Sri Chandrasekharendra Sarasvathi Swami:

భక్తి మార్గము యొక్క విశిష్టతను ” శివానంద లహరి”లోని
61వ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని చేసిన వర్ణన ఆణి ముత్యమే కదా!
తమిళ నాడులో “అంకోల గణపతి దేవళము” ఉన్నది.
స్వయం భూ గణపతి అంకోల పాదపము వద్ద వెలసెను;
అందు చేత ఆ సైకత వినాయకుడు – అంకోల గణపతి గా వాసి కెక్కెను.
తెలుగులో అనేక వ్యవహార నామాలు కలవు;

*********************************************************;

“వృక్ష మహిమ” అనే వారి పుస్తకము
2001 సంవత్సరమునాటి నుండి 5 ముద్రణలు పొందినది.
“వృక్ష మహిమ”
ధర: రూ. 30.00
కాపీలకు:-
సాయిగీతా ఆశ్రమము,
వయా బోయిన్ పల్లి,
మేడ్చల్ రోడ్,
కండ్లకోయ బస్ స్టాప్ ఎదురు రోడ్ లో;
మేడ్చల్ తాలూకా, రంగారెడ్డి జిల్లా;
ఫోను:(040)27500127;
(040)27500694;
(08418)248247)
e-mail: saigeethaashram@yahoo.com
swww.saigeethaashram.org


http://sgashram.org/index.html

[custom_author=కాదంబరి]

LINKS to essay&other informations:-
వృక్ష తరువు చెట్టు మహిమ (Web: pustakam.neth)
ప్రకృతి జనని,కోణమానిని;  టపా తేది: 28-10-10
రాసిన వారు: కాదంబరి
**************************

వివిధ సమీక్షలు


Debra Dembowski


COMMENTS తెలుగు
వృక్ష మహిమ
Posted  December 26, 2011  by  అతిథి
రాసిన వారు: కాదంబరి **************************
మన హిందూ జ్యోతిష్యశాస్త్రానికీ, ఖగోళశాస్త్రానికీ
అవినాభావ సంబంధం ఉన్నది.
అలాగే ఆయుర్వేద వైద్య విధానానికీ,ప్రకృతికీ కూడా!
ఈ సంప్రదాయమే “అహింసా విధానానికి” మూలస్తంభం గా నిలిచినది.
అందువలననే దేవాలయాలలో హిందూదేవ, దేవతా మూర్తులకు,
అనుసంధానంగా వాహనము బొమ్మ, అలాగే ప్రతి గుడిలోనూ
కనీసం ఒక చెట్టు- స్థల వృక్షము సిద్ధాంత నిబంధనలతో ఉంటూన్నవి.
చెట్లు కొట్టేస్తూ, అడవులకు చేటు తెస్తూన్న
మానవుని స్వార్ధపరత్వం పర్యావరణానికి కలిగిస్తూన్న
అపకారం ఎంతో- అంచనాలకు అందనిదని, [...]

FULL STORY »

4
COMMENTS తెలుగు
V.A.K. “ఆలాపన” కు “జై” అన్న ముళ్ళపూడి వేంకటరమణ
Posted  November 21, 2011  by  అతిథి
వ్రాసిన వారు: కాదంబరి ****************
వేంకట ఆనంద కుమార కృష్ణ రంగారావు
అవిరళ కృషికి మహోద్గ్రంధ రూపమే
513 పుటల “ఆలాపన”.
శ్రీమతి భార్గవి గారికి ‘పుస్తకప్రపంచం’
ఋణపడి ఉంటుందనడంలో సందేహం లేదు.
ఎందుకంటే సాహిత్యము అనే మొక్కకు నీరు పోసి,
సంరక్షణ చేసే వరద హస్తములు ఎప్పుడూ వందనీయాలే!
డాక్టర్ భార్గవి గారితో:”మాట మాట” (436నుండి 495 పేజీల వఱకు)
ఇంటర్వ్యూ ఈ పుస్తకమునకు హైలైట్. భార్గవి గారు 200 పేజీలు ఔతుందని
అనుకుని, ప్రచురణా కార్యక్రమానికి [...]

FULL STORY »

1
COMMENTS తెలుగు
ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము
Posted  July 23, 2011  by  అతిథి
రాసిన వారు: కాదంబరి *****************
“ఆశావాది ప్రకాశ రావు సాహిత్యానుశీలనము” –
రచయిత:- డాక్టర్ మంకాల రామచంద్రుడు గండ పెండేరములను,
అనేక బిరుదు సత్కారములను పొందిన విద్వాంసుడు ప్రకాశ రావు.
ఆశావాది ప్రకాశ రావు “ఆసాది” అనే దళిత ఉప కులమునకు చెందిన వ్యక్తి.
ఆసాదుల వృత్తి- కథా గానము.
వి.సుబ్రహ్మణ్యము నిఘంటు నిర్మాణ శాఖాధిపతి.
వడ్లా సుబ్రహ్మణ్యము ఆధ్వర్యములో మంకాల రామచంద్రుడు,
అవధానాచార్య ఆశావాది ప్రకాశ రావు గారి
జీవన ప్రస్థాన, సాహిత్య సృజన, కృషీ క్షీర [...]

FULL STORY »

0
COMMENTS తెలుగు
గొల్లపూడిమారుతీరావు ఆత్మకథ “అమ్మ కడుపు చల్లగా”
Posted  July 17, 2011  by  అతిథి
రాసినవారు: కాదంబరి ************ నిడదవోలు వేంకటరావు గొప్ప పరిశోధకుడు, పరిష్కర్తగా సాహితీ లోకములో గౌరవాన్ని పొందారు. గొల్లపూడి మారుతీరావు చెప్పినట్లుగా- నిడదవోలు వేంకటరావుకు అస్మదీయులందరికీ ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయి. గొల్లపూడి మద్రాసు రేడియో స్టేషన్ లో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూన్నారు. ఆయన నిడదవోలు వేంకటరావును- ఒక ప్రసంగమును రికార్డు చేసారు. ఆకాశవాణి బిల్డింగులో నిడదవోలు వేంకటరావు వ్యాసాన్ని చదువగా, రికార్డు చేయడం పూర్తి ఐనది. ఆనక అక్కడ కబుర్లూ, సంభాషణలూ సాగాయి. నిడదవోలు వేంకటరావుగారికి మాటిమాటికీ- “అసలు”అనడము [...]

FULL STORY »

8
COMMENTS పాతబంగారం
కథ కంచికి…
Posted  August 5, 2010  by  రవి
..మనం ఇంటికి. మడతకుర్చీలో
 తాతయ్యా, పెరట్లో బాదం చెట్టు గట్టుకింద
అమ్మమ్మా, మనవలకు జానపద కథ చెబితే
ఆ కథ  ఇందాకటి  వాక్యంలా
అందంగా, అలవోకగా, సాంత్వనగా ఉంటుంది.
కథ చివర్లో బూచి మీద మంచి గెలుస్తుంది.
ఆ  ముగింపు – కథను కంచికి పంపేసి బుడతణ్ణి
ఇంటికి తీసుకొచ్చి నిదురపుచ్చుతుంది.
బిడ్డ మనసులో ఆనందం – నిద్రలో చిరునవ్వై,
కథ చెప్పిన తాతయ్య గుబురు మీసాలమాటున ఒదిగిపోతుంది.
ఇంతకూ బుర్రమీసాల తాతయ్యకూ, ముగ్గుబట్ట తల మామ్మకూ [...]

Total reviews ;
;

Tuesday, January 17, 2012

రాజసమొప్పే బొమ్మల కొలువులు












కొలువులు కొలువులు;                   ;        మేటి కొలువులివి,
రాజ కొలువులను మించినట్టివి;
రాజసమొప్పే బొమ్మల కొలువులు

బుల్లి ఊరును నిర్మిద్దాము
ఇది మన ఇల్లు; ఇది మన ఊరు
ఈ బొమ్మలు అన్నీ మన ఫ్యామిలీ!

మురికీ, మురుగు లేని దారులు,
వీధి లైట్లతో కళకళకళలాడే మార్గాలన్నిట
అన్ని వృత్తుల జన సమ్మర్దము!

అటు ఆఫీసులు, ఆసుపత్రులు,
రైల్వే స్టేషను, బస్టాండు, షాపులు;
ఇదిగో ఇక్కడ జూ, పార్కులలో,
మైదానాలలొ ఆడే పిల్లలు;

&&&&&&&&&&&&&&&&&&


రాజసమొప్పే బొమ్మల కొలువులు;( Link:- New AvkAya)

Member Categories - బాల
Written by kadambari piduri  
Monday, 16 January 2012 11:32



Wednesday, January 11, 2012

భరతుని జెండాపై దేవకాంచనము


;
ఆదికవి వాల్మీకి రచించిన
"శ్రీమద్ రామాయణము"
గొప్ప భారతీయ ఇతిహాసము-
అని అందరికీ తెలిసినదే!
ఇందులోని అయోధ్య కాండములో
భరతుని రాకను గమనించి,
దృశ్యము వర్ణన ఉన్నది.
ఈ శ్లోకములోని విశేషము-
భరతుని టెక్కెము(Flag/ banner).
భరత ధ్వజముపైన కోవిదార పాదపము చిత్రణ;
ప్రకృతి పట్ల శ్రీరామ సోదరునికి కల
ప్రత్యేక ఆరాధనా భావము,
నాటి ప్రజల జీవనశైలికి ప్రతిబింబము.
 
;
(భరత ధ్వజముపైన కోవిదార చిత్రము:-                
ఈ అంశముతో- చిత్రలేఖకులు,
మంచి పెయింటింగులను వేయవచ్చును- అని
నా సూచన, మనవి
;
;
yathaa tu khalu durbuddhi@h bharataH svayamaagata@h||
sa Eshaa hi mahaa kaaya@hH kovidaara dhvajo rathe  || 2-84-3
;
యథా తు ఖలు దుర్భద్ధిః భరతః స్వయమాగతః| |
స ఏష హి మహా కాయః కోవిదార ధ్వజొ రధే||
2-84-3;

3. ఏష= ఇక్కడికి;డ;; రధే హి= రధముపై  
సహ్= అది; మహాకాయః=towering; kovidaara
dhvajaH=banner bearing Kovidara tree;

భరతః = భరతుడు
దుర్బుద్ధిహ్= దుష్ట ఆలోచనతో
స్వయం= తానే స్వయంగా
యథాతు ఆగతహ్= వస్తూ ఉన్నట్లుగా అనిపిస్తూన్నది

“Here is seen on that chariot,
a towering banner bearing Kovidara tree 
and hence Bharata himself with an evil intent seems to have come.”

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&  

 


కోవిదార తరువు గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాము.
कोविदार (कचनार);
 ,;;;;;
దేవకాంచనం' ఒక బాహీనియా ప్రజాతికి చెందిన మొక్క.
దీని శాస్త్రీయ నామం బాహీనియా పర్పురియా (Bauhinia purpurea)

Bauhinia variegata is a species of flowering plant,family Fabaceae
Bauhinia variegata (Leguminosae) commonly known as KACHNAR.

ఇది పుష్పించే చెట్టు.
వివిధ భారతీయ భాషలలో ఈ తరువుకు గల పేర్లు ఇవి:-
ఆయుర్వేద వైద్యంలో విస్తారంగా ఉపయోగపడే చెట్టు ఇది.
 Kanchana (Sanskrit: कांचन)
సంస్కృతములో అనేక నామావళితో పూస్తూన్న పాదపము ఇది.
సంస్కృత భాషలో దీని పేరులు:-
कनक కనక, 
कांचन కాంచన, 
कंचनार  కాంచనార, 
कोविदार కోవిదారః ;


Sanskrit: कनक kanaka, कांचन kanchana, कंचनार kanchanara, कोविदार kovidarah 
commonly known as: mountain ebony, orchid tree, variegated bauhinia
Bengali: কাঞ্চন kanchana, রক্ত কাঞ্চন raktakanchana
Hindi: कचनार kachnar, कंचन kanchan
Kannada: ಕಮ್ಚುವಾಳ kamchuvaala, ಕೆಮ್ಪು ಮಮ್ದಾರ kempu mandara
Malayalam: kovidaram
Manipuri: chingthrao
Marathi: कंचन or कांचन kanchana, कोविदार kovidara
Oriya: borodu
Sanskrit: कनक kanaka, कांचन kanchana, कंचनार kanchanara, कोविदार kovidarah 
Tamil: மந்தாரை mantharai
Telugu: దేవకాంచనము daeva-kanchanamu, మందారీ మందరి


************************************


Links to Follow:-
Kovidara tree: pomegranate tree (Link: Indianetzone)

భరతుని పతాకముపై దేవకాంచనము  (valmikiramayan.net/ayodhya/sarga84)

http://www.indianetzone.com/photos_gallery/20/species-Bauhinia_1692.జ్ప్గ్

************************************
("పాదుకా పట్టాభిషేకము"
1945లో విడుదల ఐన తెలుగు సినిమా.
(దర్శక, నిర్ణాత కడారు నాగభూషణము)
బందా కనకలింగేశ్వరరావు భరతుని పాత్రను ధరించాడు)
;

Tuesday, January 10, 2012

గుట్టపైన శిల్పము


వాగటర్ బీచ్ (గోవా)లో
శ్రీ శివ దేవుని ముఖము
కొండ  రాళ్ళపై చెక్కబడి ఉన్నది.
సాధారణంగా కొండలలో, గుహలలో
బౌద్ధ ఆరామ, శిల్పాదులు చెక్కే సంస్కృతి
మన ఇండియాలో ఉన్నది.
హిందూ దైవమూర్తి- Lord Shiwjii face
ఇలాటి పద్ధతిలో ఉండడమే
ఇక్కడి విశిష్టత.
ఈ లొకేషన్- "దిల్ చాహ్ తా హై"
అనే హిందీ సినిమా,
(Bollywood movie, ‘Dil Chahta Hai’) అలాగే ఎన్నో మూవీలు-
ఈ సుందర ప్రకృతి, అందమైన దృశ్యాలతో
వెండితెరను వర్ణభరితం చేసాయి.

Vagator beach
Vagator Beach for a beautiful sea-
panoramic view  Goa

Sunday, January 1, 2012

శ్రీ పరశురాముల కొల్లమ్-శకము కాల నిర్ణయ పద్ధతి


















"పరశు రాముడు" (The Kollam Era of the Malayalam calendar )
దీని నిర్మాణానికి మూలపురుషుడు.              
క్రీస్తు పూర్వం 825 నుండి ఈ "కొల్లమ్ శకము" ప్రారంభం ఐనది.

హిందువుల సాంప్రదాయములో చాంద్ర మానము అనుసరించబడుతూన్నది.
పంచాంగము- అనగా ఐదు ముఖ్య అంగములు కలది.
తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే అంశములు ప్రాతిపదికలుగా గైకొనబడి
కాల, లగ్న, శుభ కార్య ముహూర్తములు,
అమృత ఘడియలు, హోరా, రాహు కాలము, వారము, మాసము, ఋతువులు, వర్జ్యము-
ఇట్లాగ అనేకములు నిర్ణయించబడుతున్నవి.
మన దేశములో చారిత్రక పరముగా అనేక సంవత్సర నామావళి తో
'కాలము' - యొక్క మైలు రాళ్ళు నిలుపబడినవి.
"ఉగాది పండుగ"ను, సంక్రాంతి ఇత్యాది పర్వములను
60 సంవత్సరముల లూనార్ కేలండర్ ను అనుసరిస్తూ
మనము వేడుకగా చేసుకుంటున్నాము.
60 year cycle (Hindu astrology,Lunar Calendar)
ప్రభవ, విభవ,శుక్ల, ప్రమోద,నుండి....
క్రోధన, అక్షయ వరకూ ఉన్న
అరవై వత్సరముల "యుగావర్తము"పేరు "ఉగాది".
విక్రమార్క శకము, హూణ , శాలివాహన శకము, శకారి - ఇత్యాదిగా- రూపొందినవి.
వరాహమిహిరుడు మున్నగు పండితులు ఖగోళ విజ్ఞాన సంపదకు ఇవి తార్కాణములు.
             
*********************************************/






     






  కొల్లమ్-శకము కాల నిర్ణయ పద్ధతి:-

క్షత్రియులను వధించిన పాపమునుండి విముక్తికై,
పరశురాముడు పర్వతముపై తపస్సు చేసాడు.
గోకర్ణక్షేత్రము, అని పరశురాముడు వలన ప్రసిద్ధి కెక్కిన పుణ్య క్షేత్రము.
పరశురాముడు తన గండ్రగొడ్డలిని ఉత్తర దిశగా విసిరేశాడు.
అది పడిన సీమ పేరు "కేరళ", "దేవతల భూమి"- ఐనది.
ముంచెత్తే వర్షాలూ, వరదల నుండి రక్షించిన వ్యక్తి ఈతడు.
"జల ప్రవాహములను, నియంత్రిస్తూ నిర్మించిన ఇంజనీరు"- అని పేర్కొనవచ్చును.
కేరళ లో జనులను/ కాందిశీకులను రక్షించాడు పరశురాముడు.
వరుణదేవుని, సాగరుని అదుపులో పెట్టిన మహర్షి,
భూదేవి అనుగ్రహమును అందరికీ ప్రసాద వరముగా లభించేటట్లు చేసిన ముని పరశురాముడు.
ఇతనికే జామదగ్న్యి. భార్గవ రాముడు, ఇత్యాది నామములు ఉన్నవి.
భూమి, భౌగోళిక స్వరూప అవగాహన కలిగిన మనిషి ఈ పరశురాముడు అని అర్ధమౌతున్నది.
అంతే కాదు!
ఆతడు పండితుడు, ఖగోళ శాస్త్రవేత్త, గ్రహగమన పరిశీలనా సమర్ధుడున్నూ!
"కొల్లమ్ శకము" ను నెలకొల్పినాడు పరశురాముడు.
1000 సంవత్సరములకు చొప్పున "కాల చక్రము" ఇది.
కేరళ రాష్ట్రములోని - కొల్లమ్ రేవు పట్టణము (Kollam Town)
ఈ చాంద్రమాన పంచాంగమునకు అనుబంధమైనది.
కొల్లమ్ సిటీనే, ఇంగ్లీషు వారు "క్విలాన్" (Quilan) అన్నారు.

*****************************************;

సంవత్సరములు- వర్గీకరణ పద్ధతులు:-

అనేక దేశాలలో వేలాది ఏళ్ళ నుండీ,
మానవులు, విశేష పరిశోధనలు చేస్తూన్నారు.
అన్ని ఖండములలోనూ విభిన్న మార్గాలలో కాలమును గుర్తించుట-
"చరిత్ర"-కు ఏర్పరచిన మైలు రాళ్ళు ఐనవి.
ఇలాగ టైము వింగడింపు - చారిత్రక అవగాహనకు
రూపొందించిన సుగమ మార్గములు ఇవి.
యుగ యుగాల నుండీ ఈ కృషి వలన
అనేక కాల నిర్ణయ స్వరూపములు-
ప్రపంచములో రూప కల్పనలు చేయబడినవి.
 
1. లూనార్ ఇయర్ (Lunar Year) : 365.242216 రోజులు
2.లీపు సంవత్సరము (Leap year):- 366 రోజులు;
3.జూలియస్ వత్సరము:-
4. సోలార్ ఇయర్
5.సైబీల్ ఇయర్:
6. అనామలిష్టిక్ సంవత్సరము:-
7. గ్రిగేరియన్ కేలండర్:

****************************************;

టైమ్ కు వందలాది పేర్లు :-

అస్సీరియన్ ;
ఆర్మీనియన్:
అట్టిక్ :
 బాబిలోనియన్ ;
బహాయి ;
బిక్రంసంవాత్ ;
బౌద్ద ;
బర్మా;
చైనీస్ ;
ఈజిప్టియన్ ;
ఇథియోపియన్;
జర్మనీ;
హీబ్రూ ;
ఇరానియన్;
ఐరిష్ కేలండర్;
జపనీస్;
జావనీస్ ;
జూలియన్;
కొరియన్;
లిథువేనియన్ ;
హిందూ కేలండర్: బెంగాలీ:  మలయాళం
మాయ,  నానక్‌షాహి, నేపాల్ సంబత్

ఇతర  365-days కేలండర్లు:-:-
ఈజిప్టు calendar
మాయా Haab' క్యాలెండర్
జొరాష్ట్రియాన్  calendar;
;
*********************************************8

శ్రీ పరశురాముల కొల్లమ్-శకము కాల నిర్ణయ పద్ధతి
                                            Kollam Varsham , 825CE

సంవత్సరములు- వర్గీకరణ పద్ధతులు:-

కొల్లమ్-శకము కాల నిర్ణయ పద్ధతి:- 

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2012



                        
                          2012 నూతన సంవత్సర  శుభాకాంక్షలు
                                   Wish you Happy New Year 2012


                              konamanini    
Link for Telugugreetings