Wednesday, June 30, 2010

జార్జి హార్రిసన్ శ్రీ కృష్ణ భక్తి గీతము ;






















పాశ్చాత్యులు అనేక మంది,"హరే క్రిష్ణ" భక్తి ఉద్యమముతో ప్రభావితులై ,
తమ జీవిత విలువలను ఉన్నత స్థాయిలో మలుచుకున్నారు.
"జార్జి హార్రిసన్ వెస్టర్న్ మ్యూజిక్ లో నిష్ణాతుడు.
" శ్రీ కృష్ణుని" కీర్తిస్తూ, తానే స్వయంగా రాసి, ఆలపించిన గీతం ఇది.
ఈ ఇంగ్లీషు పాటను చూడండి.


LYRICS ;
________

"MY SWEET LORD" -
________________
( BY GEORGE HARRISON ;)
________________________

















My sweet lord
Hm, my lord
Hm, my lord!

I really want to see you
Really want to be with you
Really want to see you lord
But it takes so long, my lord !

My sweet lord
Hm, my lord
Hm, my lord!

I really want to know you
Really want to go with you
Really want to show you lord
That it won't take long,

my lord (hallelujah)
My sweet lord (hallelujah)
Hm, my lord (hallelujah)
My sweet lord (hallelujah)

I really want to see you
Really want to see you
Really want to see you, lord
Really want to see you, lord
But it takes so long, my lord (hallelujah)

My sweet lord (hallelujah)
Hm, my lord (hallelujah)
My, my, my lord (hallelujah)

I really want to know you (hallelujah)
Really want to go with you (hallelujah)
Really want to show you lord (aaah)
That it won't take long, my lord (hallelujah)
Hmm (hallelujah)

My sweet lord (hallelujah)
My, my, lord (hallelujah)
Hm, my lord (hare krishna)
My, my, my lord (hare krishna)
Oh hm, my sweet lord (krishna, krishna)
Oh-uuh-uh (hare hare)

Now, I really want to see you (hare rama)
Really want to be with you (hare rama)
Really want to see you lord (aaah)
But it takes so long, my lord (hallelujah)
Hm, my lord (hallelujah)
My, my, my lord (hare krishna)
My sweet lord (hare krishna)
My sweet lord (krishna krishna)
My lord (hare hare)
Hm, hm (Gurur Brahma)
Hm, hm (Gurur Vishnu)
Hm, hm (Gurur Devo)
Hm, hm (Maheshwara)
My sweet lord (Gurur Sakshaat)
My sweet lord (Parabrahma)
My, my, my lord (Tasmayi Shree)
My, my, my, my lord (Guruve Namah)
My sweet lord (Hare Rama)

[fade:]
(hare krishna)
My sweet lord (hare krishna)
My sweet lord (krishna krishna)
My lord (hare hare)

Saturday, June 26, 2010

అత్తరు వర్షం

















పురి విప్పార్చిన నెమలి పింఛములా
అవిగో! అవిగో! కారు మబ్బులు;
ఆత పత్రము =umbrellaa
తీసుకు రండి తొందరగా!

చండా మొండీ వర్షం వచ్చెను
పడిసం పట్టును ; జలుబూ చేయును
ఆరోగ్యమే సౌభాగ్యము కద!
రెయిన్ కోటులను ధరియించండీ!

( పిల్లలు) :::

ఓహో వర్షం, ఆహా! హర్షం!
వాన జల్లుల అత్తరు, పన్నీర్లు
వాన బాలకు కేరింతలమై
తడిసి, తనియుతాం, ఆటలాడుతాం!!!
Baala


By kadambari piduri ;
May 28 2010

Thursday, June 3, 2010

నీలముపై పగడం

















మౌళి పింఛము వాని పెదవుల
భావగర్భిత మంద హాసము
ఇంద్రనీలము మేని ఛాయల
ఒదిగినట్టి పగడ మెవరే???
ఆ మణి ప్రవాళ మెవరే?? ||

(చెలులు):::

“ ఇంకెవ్వరమ్మా! రాధిక !
మన రాధిక! " ||

ప్రణయ దృక్కులు జతలు జతలుగ
అల్లుకున్న తోరణమ్ములు
కెంపు, నీలము కన్నయ్య, రాధిక
ఇంపు పెంపుల రాగ మాలిక ||

కళా సీమలకీ జోడీ
సరిగ పోగుల చాందినీ
సకల హర్షామోద ద్యుతి తతి
స్వర్ణ కానుకలీ పుడమి తల్లికి ||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&




By kadambari piduri, May 28 2010 8:40PM

ప్రకృతి భక్తి





















సంపెంగలు, పున్నాగ పూలు
చేమంతీ, గులాబీలు
కనకాంబర, మల్లియలు
మొగలి, దవన, మరువములు
అన్ని తపస్సు చేసాయి
దేవుడు వరముల నిచ్చెను;

గాలి పట్టు తివాచీని
పొందినవీ సంబరముగ;
ఆ మాయ జంబుఖాణ పైన
సరగున పూ సుగంధాలు
బాలలందరిని చేరి
చెమ్మ చెక్క లాడాయి;

బాల ప్రపంచములో పువులు
ఎన్నెన్నో నేర్చాయి; అవి -
తమ వన్నెల తావులకు
మెరుగులను దిద్దు కొనెను

మోదములకు మారు పేరు
కేరింతల చిన్నారులు
అందులకే ప్రకృతి ఇట
భక్త పరమాణువు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&
&&&&&&&&&&&&&&&&&&&&&&&

Baala


By kadambari piduri,
May 28 2010 8:34PM