Wednesday, February 12, 2014

మేలిమి బంగరు అక్షింతలు

పల్లవి:   
ముగ్గులు వేసిన గుమ్మములోన
చిందులు వేయును ముద్దుల గుమ్మడు  ||              

"కన్నయ్యా! ఈ అల్లరి ఏలర?                                     
వల్ల మాలిన రభసలు చేతువు, ఎలాగ?                                 
అడ్డూ ఆపూ లేని తుంటరివి!"                                
అన్న యశోదకు బదులుగ కన్నయ,  

"నా చిరునగవులతో ,
కొత్త ముగ్గులను                                  
తీగపూవుల 'రంగవల్లికల'                                         
తీర్చిదిద్దుతానో అమ్మా!"
                                                
అంటూ ,కృష్ణుడు   
"రభస"ను కాస్తా                                              
"రాసలీలల రా సభ" గాను   
తృటి కాలములో మార్చెను,ఔరా!                                  
తరుణుల్లారా! తిలకించండి! 
రాజు కొలువును 
రమణుల్లారా! 
మోదమ్మలరగ 
వీక్షించండి, 
సంకురాత్తిరి పండుగకివియే
లక్ష కోటుల మేలిమి బంగరు అక్షింతలు కదా!
;













***************************,
;
రాస లీలల రాజ సభ / నవ్వుల ముగ్గులు;1/18/2009 10:40:00 PM , Labels: బాల కవితా గీతికలు
సంకురుమయ్యకు స్వాగతము;నాట్యము చేసీ నటరాజ;
వెన్నెల రథము; మలబరి చెట్లు,చీనాంబరములు;
కుంకుమ భరిణలు, సంకురుమయ్యకు స్వాగతము;
కరచాలనము; చుక్కలతో స్నేహము; మామ కాని మామ,
1 జాబిలి చాలా తపములు చేసెను;
ఆటపట్టు; 1) ముద్దుల మూటలు - కట్టును మాటలు;
1) తళుకు తళుకు చుక్కలు; మిణుకు మిణుకు చుక్కలు;
విన్నపములు 1; "ఆట పట్టు " (విన్నపములు);
విన్నపములు 2; విన్నపములు 3;
1) లాహిరి ! లాహిరి! వీల పాటలను;
వెన్న పూసల దండలు; సీతాకోక చిలకలు:
1) సీతా కోక చిలకమ్మలు ; వచ్చేసాయి! వచ్చేసాయి!;
మల్లికా! మల్లికా! ఈ పూ దోటకు కానుకా!;
;

;
జాతీయ పక్షి; 1)కన్ను కన్ను నెమలి కన్ను; మరకత మణులు:
1) కిల కిల నవ్వులు, సందడులు; పిల్లలు, పాపలు ;
పుడమిని ముదముల సార్వ భౌములు!:
1)వెన్నెలా! వెన్నెలా! - మిన్నుల్లొ వెన్నెల; కన్నుల్లొ కురియగా - కాణాచి వెన్నెల;
హరి విల్లు బహుమతి;
1)బాల బాలికలు రావాలి!; ఆటలు పాటలు విర బూయాలి! మూతీ ముక్కూ విరుపులు మాని
ప్రకృతి గీతికి "పల్లవుల"వాలి!;
"భూమి పుస్తకము"; అమ్మలు నవ్వులు:
1)కెంపులు,రవ్వలు,రతనాలు - కొత్త మెరుపులు ,
మిరుమిట్లు; మణులు,మాణిక్యము - పగడాలు,ప్రవాళ అందాలు;
వెన్నెల రేడా!; ఉయ్యాలోయ్! ఉయ్యాల!;
1)బోసి నవ్వుల బాపు,నోటి: నుండి వచ్చినదె వాక్కు;
తాను:పలికిన పలుకు ;జవ దాటనట్టి; అపర ఋత్విక్కు;
మంగమ్మ చూపులే రంగారు బంగారు;("సప్తగిరి" పత్రిక); (జనవరి ,2009 పత్రిక లో ప్రచురణ) ;
వెలుగుల నవ్వులు; బాల బాలికల కిల కిల నవ్వులు;
ఆటలు, పాటలు -సందడి హేలలు;
ప్రకృతి అంతా - నవ రస భరితం; అలరించే బృందావని; వన్నెల పరిమళ పూవులము!;

కోణమానిని బ్లాగును మొదలుపెట్టిన కొత్త, నాటి రచనల ముద్రణ రూపాలు ఇవి.   J    

కోణమానిని 2009 Fibruary - January   (Link my Blog)

4 ఫిబ్రవరి 2009 బుధవారం

జూకాలు - సంకురుమయ్యకు స్వాగతము 
(konamanini : views: 54927)

Thursday, December 19, 2013

ఎంత సేపు ఈ ఎదురుతెన్నులు

ఎంత సేపు ఎంతసేపు ఎంతసేపనీ:
ఎదురు చూస్తు ఉండాలి!?
ఈ తీరుగనే గోపాలక్రిష్ణ! ||ఎంత సేపు ||
;
ఎద నిండా ఆరాటం, ఏవేవో సంశయాలు,
దోబూచులు దొంగాటల మేటివి ఎటులైనావని?
;
నీదు వామ హస్తమున  పాంచ జన్యమున్నది గద!
మా శంకలను తీర్చుమోయి?
శంఖు తీర్ధ ప్రసాదములు భక్త కోటి కందును గద!?||ఎంత సేపు||
;
నిరతము నీ కరము నుండు;
కౌమోదకము స్థితియె మేలు-
మా కన్నను కద! కన్నా! ||ఎంత సేపు ||
;
ఆర్త రక్షకుడవనుచును
నీకు గొప్ప బిరుదములు;
తోచి తోచకుండా; మము వేపుట నీ మరియాదా!?
సరి సరి! ఓ మురారీ! బర్హి పింఛధారీ! ||ఎంత సేపు ||
;
అవతారము లెత్తు విద్య మాకు; కాస్త నేర్పుమోయి!
నీ చెంత నుండు భాగ్యముకై;
విల్లుగానొ, దండగానొ, ఏదో ఒక వస్తువుగా;
నీ ఎడదపైన నుందుమోయి!
మేముందుమోయి! ||ఎంత సేపు||

*****************************;

పాట:- భక్తుల విన్నపములు!!!!!!!

[1. నీదు ఎడమ చేతిలోన/
    వామ హస్తము= ఎడమ చెయ్యి
    దక్షిణ హస్తము= కుడి చేయి ]

  ౩ ౪              ౯      

విజ్ఞానపు పసిడి మేడ!

Krish, Fancy Dress 


 బుడుగు బుడుగు పిల్లలార!
 రండి!రండి! స్కూలుకు
  అమ్మ నాన్న 'చిటి వేళ్ళను పట్టి
  రండి! రండి! బడికి;
             అక్షర గుడికి
             మీరందరు సత్వరమే!     ||

  చెడుగుడు గుడు గుంచం
  ఆటలంత తేలిక!
        అక్షరాలు నేరిస్తే
        ఉంటుందెంతెంతొ మజా!
               అది,విజ్ఞానపు పసిడి మేడ!     ||

                    ''''''''''''''''''''''''''''''''''

కిట్ కాట్ పేరెలాగ వచ్చింది?   (Link: See Essay: kONamaanini )
గురువారం 19 డిసెంబర్ 2013

ఆధార పదాలు:-
KitKat club, an 18th-century literary salon in Christopher Catling's
(hence the "Kit Cat") pie-house
in Shire Lane, 

Friday, September 6, 2013

dozen ఆనుపానులు

అర్ధణా,  అణా, బేడ- అనే కాయిన్లు నా చిన్నప్పుడు ఉండేవి.
పైస, దమ్మిడీ, కాణీ లు – ఒక పైస విలువ – తొలి ద్రవ్యం.
పిల్లలు కాణీలను (రాగి లోహంతో తయారు ఔతూండేవి)
చూపుడు వేళ్ళకు తగిలించుకుని, వెళ్ళి చిరుతిళ్ళు కొనుక్కునేవారు.
ఒక కానీకి ఒక నువ్వు జీడీ- వచ్చేది. ఆ చిన్ననాటి ముచ్చట్లు తలుచుకుంటే బహు ముచ్చట!                      

! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !
మన దేశంలో దశాంశ పద్ధతి ముఖ్యంగా అనుసరించబడేది.
వస్తుమారక వినియోగ సందర్భాలలో, పదార్ధాలను తులలో తూచేటందుకు- ఒక ప్రామాణికతను ఏర్పరచవలసివచ్చింది.
తూనికలు, కొలతల కొఱకై // పద్ధతిని నిర్మించినారు. దీనికే "మెట్రిక్ పద్ధతి" అని పేరు. దశాంశ పద్ధతిని అక్టోబర్ 1 1958 లో ప్రవేశపెట్టి ఉన్నారు.
అల్తే దశాంశ పద్ధతి- లాగానే- ప్రాచీనకాలమున భారత దేశములో అభిమానించబడిన కొలమానము, "నవ్"= 9 - అనే నెంబర్.
నవమి తిథి, నవ నందులు, ఇత్యాదులు
×××××××××××××××××××××××××××××××××

అర్ధణా,  అణా, బేడ- ఈ గుణాంకములలో ఉన్న విశేషం ఏమిటో మీరు కనిపెట్టారా?
3, 6, (9), 12 అనే అంకెలు వీటికి మూలములు.
కాల గణనము- అధిక శాతం 6 పైన ఆధారపడి ఉన్నది.
చాంద్రమానము ఈ లెక్కలకు మూల స్తంభము.      
మూడు- ఆరు ఋతువులు, సీజన్లు, 12 నెలలు, ప్రధానంగా ఈ పరిగణనలు సాగుతూన్నవి.
సాంప్రదాయ, ఆచారములు, పండుగలు సైతము వీని ప్రకారమే ఏర్పరచబడినవి.
12 పవిత్ర నదులు, వాటిక్లో పుణ్య స్నానాలు- “పుష్కరము” – అంటే
“12 సంవత్సరములకు ఒకసారి వచ్చే పండుగ”.
ప్రాజ్ఞులు ప్రతి పన్నెండు ఏళ్ళకు ఒక సారి ఈ వేడుకలను –
పుష్కర కాలములో– వచ్చేలా – ఏర్పరిచారు.
×××××××××××××××××××××××××××××××××

బేడ = 12 నయా పైసలు. దుకాణములలో పళ్ళు కొనేటప్పుడు వి
క్రయదారుని ఏమని సాధారణంగా అడుగుతూంటారు?
ముఖ్యంగా అరటిపళ్ళ అంగడిలో  కొనేటప్పుడు అడిగే వాడుక మాట ఏమిటి?
“డజను ఎంతకి ఇస్తావు?” మన ఆంధ్రులు అచ్చ తెనుగులో -  అరటిపళ్ళు క్రయ విక్రయాలలో మాత్రం కొన్ని స్పెషల్ వర్డ్సు అగుపడుతూంటాయి! “హస్తం” = పండ్రెండు కదళీ ఫలములు. “అమడపళ్ళు” = జతగా ఉండే అరటిపళ్ళు. పన్నెండింటికి ఒక పండు ఉచితంగా ఇవ్వాలనేది- అవగాహనా ప్రధానంగా ఏర్పడిన  రూలు. దీనినే “కొసరు” అని   పిలుస్తారు. భోజనాల వేళ-  “కొసరి కొసరి వడ్డించుట” అనే తీపి జాతీయం కూడా ప్రయోగంలో ఉండేది. (ఇవన్నీ ఆనాటి ముచ్చట్ల మాటలే లెండి!)
మరి “డజను”  అనే పదము ఎక్కడి నుండి వచ్చి మన ద్రవ్య సీమలోనికి అడుగిడింది?
సంస్కృత భాష మన తెలుగుకు ఎన్నెన్నో పదముల పుష్పాలను ఒసగింది. అలాగే సరిహద్దు రాష్ట్ర భాషలైన - ఒరియా, కన్నడము, తమిళము,  మరాఠీ   భాషల నుంచీ, అలాగే రాజభాష ఐన హిందీ నుండి సైతము  “లెక్కలేనన్ని మాటల తొలకరి జల్లులతో” త్రిలింగ భాష ఐన తెలుగు సీమ ఓలలాడినది. ఉర్దూ, చాలా ఇంగ్లీషు  పలుకులు – తెలుగుతల్లి ఒడిలోకి చేరి  కేరింతలాడుతూన్నవి.
*********************;
“Dazon” అనే మాటను మనము ఏ భాష నుండి స్వీకరించినాము?
ఈ నుడికారము అటు కన్నడము నుండైనా కావాలి, ఇటు ఉర్దూ, పార్శీ, హిందీల నుండి ఐనా అవ్వాలి?
కానీ చిత్రంగా- ఈ నామము- ఫ్రెంచి లాంగ్వేజ్ లోనిది.
“ద్వాదశ” = 12.
మనకు మల్లేనే ఫ్రాన్సు దేశ ప్రజలు కూడా “12” ను కేంద్రముగా వ్యావహారిక లెక్కలను వాడేవారు.
"డజను” కి లఘు రూపం- doz, dz
కాలములు, పండ్రెండు మాసాలు, ఈ పగిదినే- ఏడాదికి- మున్నూట అరవై రోజులు;
దాదాపు సమయ నిర్ధారణలన్నీ ఈ “అర డజను”, "డజను” - ల మీదనే ఆధారపడి – ఖగోళ  శాస్త్రవేత్తలు సిద్ధం చేసిరి. సిరి! సిరి!
×××××××××××××××××××××××××××××××××

మెసపొటేమియా దేశస్థుల sexagesimal నుండి – యూరోపీయులు -ఈ గణితమును పుచ్చుకుని ఉండవచ్చును. ఇలాగ ద్వాదశ ఆధారిత సంఖ్యా గణనమును “ duodecimal system/ dozenal” అనే సాంకేతిక నామాలు కలవు.
ఇక మన సీమలో- “16 అణాల తెలుగుదనం ఉట్టిపడ్తూన్నది” అనే నుడికారం ఉన్నది.   బండి మీద పళ్ళు అమ్మకానికి వచ్చినప్పుడు, పదిరెండు- కు ఒకటి కొసరు ఇవ్వడం” ఆనవాయితీ మనకు కనపడ్తుంది.
తమాషా ఏమిటంటే- యూరోప్ లో కూడా ఈ అలవాటు ఉన్నది.
“బేకర్స్ డజన్” (A baker’s dozen) అంటే
12 కి బదులుగా- కాస్త చేతి బారుగా “13”  ఉరుములను ఇవ్వడమే!
కాస్త కొసరును ఇచ్చే ప్రక్రియకు "బేకర్స్ డజన్" అనే పేరు కలిగినది.
13 వ శతాబ్దం నాటిది ఈ వాణిజ్య సదుపాయము.
×××××××××××××××××××××××××××××××××

3, 6, 9 అంకెల ఆధారముగా ఏరియాలనూ, పొలాలనూ, స్థలాలనూ కొలుస్తూన్నారు.
అడుగులు, అంకణములు, గజములు- మొదలైన కొలతలు-
గుంటూరు, మధ్య ఆంధ్ర జిల్లాలలోనూ, దక్షిణాంధ్ర ప్రాంతాలలో ఇప్పటికీ ఉపయోగితమౌతూన్నవి
ఉదాహరణకు:- 72 ఫీట్సు ఒక అంకణము – ఈ పద్ధతితో అన్నమాట!

×××××××××××××××××××××××××××××××××
9వ ఎక్కంలో ఒక తమాషాను గమనించండి.
అంకెలను కూడితే మళ్ళీ "తొమ్మిది" మాత్రమే వస్తుంది.
ఇలా వచ్చేది ఈ "నవ సంఖ్య"కు మాత్రమే!
ఉదాహరణకు :-
9×1= 9;
9×6= 54:

54- లోని రెండు అంకెలనూ కూడి చూస్తే- తొమ్మిది- ఔతుంది.
5+4= 9;
ఇలాగే ఆ Nine ఎక్కము అంతా వస్తుంది.

×××××××××××××××××××××××××××××××××









 పది పైసలు; కాలక్షేపం కబురులు;  (ఫోటో లింక్ )
1 Gajam = 1 Sq Yard = 9 sq feet  ఫీట్సు ఒక అంకణము
9 చదరపు ఫీట్లు= 1 గజము
1 Acre = 100 cents/0.405 hectares/605 Ankanas
1 cent = 6.05 Ankanas/48 Sq.Yards
1 Ankana = 8 Sq. yard/      
72 Sq. Feet ( 72 ఫీట్సు ఒక అంకణము)
1 Sq. Yard = 9 Sq.Feet  ;  
             

Saturday, August 17, 2013

సీతమ్మ వారి జడ కుచ్చుల పూలు

సీతమ్మ వారి జడ కుచ్చు పూలు; 
మా తోటలోన  విరబూసినాయి;
మహ మంచిపువ్వులు; ఈ సీతమ్మ పూవులు;  || సీత ||  
;   
ముఖమల్లు పూలు, మెత్తన్ని పూలు; 
మహమల్లు పూలు, మహరాణీ పువ్వులు
మహలులందందున మురిపించే మెత్తన్ని పూలు ; 
మహ మంచి ఈ సీతమ్మ పూవులు  || సీత ||
;
సూర్య కాంతి మెరసేటి సొంపైన పువ్వాయిలు;          
పూరేకులన్నీ వెల్వెట్టు జారు; 
గుడిసెలందు, వాడలందు, గుడి ఆవరణలలోన; 
వీధులందు, అరుగు పక్క; అందాలై జాల్వారు;  || సీత ||    
;
మిసిమి కోమలమ్ములీ ఏక దళ పుష్పములు ;   
చూడ చూడ ; కిత కితలౌ - ద్వి దళముల సౌరులు; ;  
సీతమ్మ నవ్వులకు చక్కనైన గూళ్ళు || సీత ||    
పువ్వుల్లు తల్లి మొక్క కెంతో మోదమ్ములు; 
కొమ్మ కొమ్మన పూసిన సన్నాయి లోలె  
తోచేను ఈ సీతమ్మ జడ గంటల పూలు || సీత ||         
;
ఈ మొక్క శ్రీరామ చంద్రులకు; 
మనసారా ఇచ్చేనీ మనసైన పుష్పాలను; 
ఈ సీతమ్మ జడ కుప్పెపూలు ||  


************************************,


;


;
సీతమ్మ జడ గంటల పూలు;

53032 -  konamaanini views;

Wednesday, July 31, 2013

మహాత్మా గాంధీ రంగోలీ playing

రంగోలీ(रंगोली)  అరుదైన ఫొటో, చూడండి.
మహాత్మా గాంధీజీని ప్రజలు హోలీ వేడుకలతో రంగుల ఆటలు ఆడారు.
ఆ సరదాలను ఏ చేతి కెమేరా చిత్రబద్ధం చేసిందో గానీ, మనకు ఈ ఛాయాచిత్రం లభ్యమైనది.
;
























రంగోలీ Gandhi Mahatma रंगोली : : 

Tuesday, July 30, 2013

వసుంధరకు వైభోగం



ఇద్దరిని ఉన్నాము మనము: 
అద్దరిని ఉన్నాడు స్వామి!
సాగుదాము అందరమూ;
మనమందరమూ;  || 
బైలుదేరుదాము, రండి! - 
అద్దరిని ఉన్నాడు స్వామి!
స్వామి దరికి చేరుదాము; ||

వసుంధరకు వైభోగం; 
సదా అలంకారములే! 
ఎలాగెలాగెలాగ? 
ఆ భోగము రహస్యాలు 
అవి ఏలాగున, చెప్పండి! ||

వసుంధరకు వైభోగం; 

సదా అలంకారములే!  ||


ఆ ఆరునొక్క గిరులలోన; 
విరుల దండ వోలె ఉన్నవిలే!
ఏమిటవి? ఏమిటవి? 

( స్నేహితులు):- 
విరిబోణి నగవుల సిరులు అవ్వి; 
నవ్వు పువుల చెలువమ్ముల- 
పూజలను గైకొను మా తిరుమలపతి! 
నారాయణ! |నమో నమో! ||
కుడి ఎడమల; సతులిరువురు;
శ్రీదేవి, భూదేవి! 
మువ్వురినీ ముచ్చట కన: 
ముక్కంటికి తరమౌనా? 
ఆ సహస్రాక్ష- ఇంద్రునికీ సాధ్యమౌన? || 

నారాయణ! |నమో నమో! 
నమో నమో! నారాయణ! | || 

భక్త కోటి సునయనముల 
లబ్ధి దొరికి ఉన్నాది;
ఇన్ని కోట్ల కనుల నిధులు
వసుంధరకు వైభోగం



****************************;

#iddarini unnaamu manamu: 
saaguna manamamdaramuu; 
bailudErudaamu, ramDi! - 
addarini unnaaDu swaami!
swaami dariki chErudaamu; ||
 snEhiitulu:- 
aa aarunokka girulalOna; 
wirula damDa wOleunnawilE!
EmiTawi? 2;  = 
wiribONi nagawula sirulu awwi; 
nawwu puwula cheluwammula- 
puujalanu gaikonu maa tirumalapati! naaraayaNa! |namO namO! ||
kuDi eDamala; satuliruwuru; SrIdEwi, bhuudEwi! 
muwwurinii muchchaTa kana: mukkaMTiki taramaunaa? 
sahasraaksha- imdrunikii saadhyamauna? || ||
bhakta kOTi sunayanamula labdhi doriki unnaadi;
inni kOTla kanula nidhulu la
wasumdharaku waibhOgam
 
****************************;

 Song 2:-


valla maalina kOpamElanayyaa!
challanayyaa! taalmi daalchumu
bulli pedavula navvu chiMdiMchu!         ||

challa kuMDala pagula koTTi
golla BAmala nallareDataavu;
olla kuMDaga lEvidEmayyaa!
pollu pOnI chilipi nI sommu        ||

hari chaMdanamulanu challa mannaavaa
“mannaaru dEvaa”!
siri - vaalu chUpula tEru nekkEvaa!      ||  

{Thursday, July 15, 2010
akhila wanita
చతురతల దొర }

****************************;

Sunday, July 21, 2013

ఎంత సేపు ఎదురు చూస్తు ఉండాలి!?

ఎంత సేపు ఎంతసేపు ఎంతసేపనీ:
ఎదురు చూస్తు ఉండాలి!?
ఈ తీరుగనే గోపాలక్రిష్ణ! |||ఎంత సేపు ||
;
ఎద నిండా ఆరాటం, ఏవేవో సంశయాలు,
దోబూచులు దొంగాటల మేటివి ఎటులైనావని?
;
నీదు వామ హస్తమున  పాంచ జన్యమున్నది గద!
మా శంకలను తీర్చుమోయి?
శంఖు తీర్ధ ప్రసాదములు భక్త కోటి కందును గద!?||ఎంత సేపు||
;
నిరతము నీ కరము నుండు;
కౌమోదకము స్థితియె మేలు-
మా కన్నను కద! కన్నా! ||ఎంత సేపు ||
;
ఆర్త రక్షకుడవనుచును
నీకు గొప్ప బిరుదములు;
తోచి తోచకుండా; మము వేపుట నీ మరియాదా!?
సరి సరి! ఓ మురారీ! బర్హి పింఛధారీ! ||ఎంత సేపు ||
;
అవతారము లెత్తు విద్య మాకు; కాస్త నేర్పుమోయి!
నీ చెంత నుండు భాగ్యముకై;
విల్లుగానొ, దండగానొ, ఏదో ఒక వస్తువుగా;
నీ ఎడదపైన నుందుమోయి!
మేముందుమోయి! ||ఎంత సేపు||
;

********************************;

పాట:- భక్తుల విన్నపములు!!!!!!!

[1. నీదు ఎడమ చేతిలోన/
    వామ హస్తము= ఎడమ చెయ్యి
    దక్షిణ హస్తము= కుడి చేయి ]

Saturday, May 25, 2013

గిన్నెలని క్లీన్ చేసే 'కిల్మోరా' చెట్టు

“కటార్ మల్ కోవెల” కు సంబంధించిన ఆచారములలో ఒక మొక్కకు అవినాభావ సంబంధం ఉన్నది.
కిల్మోరా చెట్టు వలన ఆ ఊరికి కూడా పేరు వచ్చింది. తరువు హిమాలయములలో గుర్రం జీను ఆకారములో ఉన్న ఉపరితలమున ఈ చెట్టు పెరుగుతున్నది.
నిట్టనిలువుగా కోసుగా ఉన్న కనుమ లాంటి ఆ చోట కిల్మోరా వలన “కిల్మోరా” అనే పేరు వచ్చింది.
బ్రిటీషు వారు పాలించే రోజులలో పాశ్చాత్య ఉచ్చారణలో క్రమేణా “అల్మోరా” గా మారిపోయింది.
కోశీ/ కౌశిక్ నది, సూయల్/ శాల్మలీ నది
ఈ గ్రామము వద్ద ప్రవహిస్తూ, పాడిపంటలకు, పచ్చదనముతో
ప్రకృతి విలసిల్లే ఆహ్లాదకర వాతావరణానికి హేతువులౌతూన్నవి.
ఆల్మోరా జిల్లా హరితభరిత సౌందర్యాల రాశి, హిమగిరులలోని ఖగ్ మారా కొండలు
(Khagmara hills)సందర్శకులకు, ట్రెక్కర్స్ ని ఆకర్షించే దర్శనీయ స్థలములు.

************************;

ఇంతకీ కిల్మోరా కథాకమామిషూ ఏమిటి?

వంగ పండు రంగు కలిగిన పుష్ప ఫల భరిత వృక్షము కిల్మొరా. 

ప్రాచీన కాలములో ప్రజలు - కతర్ మల్ గుడిలో- పాత్రలను శుభ్రం చేయడానికి-
ఈ కిల్మోరా చెట్టును ఉపయోగించే వారు.
మన దేశములో - పుణ్య క్షేత్రములో, ఆలయములోని గిన్నెలు,
తదితరములను పరిశుభ్రం చేయడానికై ఒక చెట్టు భాగాలను వాడటం-
బహుశా ఈ "అల్మోర"  (పాత నామం- కిల్మోరా)లో మాత్రమే మనకు కానవస్తూన్నది.
Koshi, (Kaushiki), and Suyal (Salmale)

******************************************;

ఉత్తరా ఖండ్ కి కలికితురాయి “ఆల్మోరా” మండలము.
నండదేవి దేవాలయం, కాసర దేవీ ఇత్యాది అనేక కోవెలలు బాలో కళ్యాణ్ చాంద్ మహారాజు కాలములో నిర్మించబడినవి.  “అల్మోరా” లో ప్రసిద్ధి గాంచినది.
స్వామి వివేకానందుడు  కాసర్ దేవీ గుడి దరి ఒక గుహలో ధ్యానం చేసేవారు.

Taags:-

Purple colour fuits, Kilmora Tree;

(Almora plug Kilmora plant for washing the utensils of "Katarmal Temple".   

Thursday, April 18, 2013

అవిశ్రాంతంగా సాగాల్సిందే!


సముద్ర కెరటాలపైన
నిరంతర చలన ముద్రలు 
చైతన్యానికి ప్రతీకలై
ఫ్రెస్కో ఆర్టు లాగా!   

జీవన నిర్భీక ప్రయాణం  
అవిశ్రాంతంగా సాగాల్సిందే!

ఆ కడలి అలలపైన
తేలాడే వెన్నెలలా! 

అలా అలా అలా...
అలాగే...
ఆలాగుననే... 

*******************,

Hamsini  (Link - my "POETRY")

అవిశ్రాంతంగా సాగాల్సిందే!
కాదంబరి,  Apr 03, 2013






















Girl In Rain  Stock Photos and Images (Link for photo)
00051797; konamanini Views
;

Saturday, April 13, 2013

మాధుర్య తూకము


సరసు తరగల తీవియలపై
గగన నీలిమల "స'రాగాలు' "
నా అంతరంగం -
సహస్ర దళ నళినమై
విరబూయు చున్నది,

ప్రియ సఖీ!
హృదయమున్నది మనిషికేగా!
కలలు, కల్లలు ఎడదకేగా!

కొలను ఒడ్డున కాస్త సేపు
ఆసీనులయ్యీ గడిపితే;
కలత దీరును కాస్తసేపు;
మరి,
ఆ కొన్ని క్షణాల
తీపిదనపు తూకమెంతో తెలుపగలవా!?
ఆ కొన్ని నిముషమ్ముల
కొలత ఎంతో చెప్పగలవా!!? నేస్తమా!

కలవరమ్ముల నపనయించే లిప్తపాటులు-
కలకండల మాధుర్యాల అంత!
యోచనేల?
వాని నిడివి
రోదసీ దిశాంతముల కొసల వరకూ
వాని కొలతలు!

అట్టి - నిమేషమ్ముల
నీరజముల చూపు తూపుల
సరోవరము వీక్షించుచున్నది
చోద్య, విడ్డూరమ్ముగాన్!
తాను -
అనిమేషయై సరసమ్ముగాను -
దేవ గణములనే
కికురించుచున్నది, చూడుమా!  

    (రచన:-  కాదంబరి )



మాధుర్య తూకము: Link = Neelahamsa

 2013/03/30  "కొలను" పై కాదంబరి గారి కవిత ! -3


















Cloud 9 talks: photo curtecy: 

***********;

Friday, March 15, 2013

పూర్ణ కుంభము


హేమ మహర్షి గొప్ప తపస్సు చేసాడు.
ప్రసన్నుడైన విష్ణుమూర్తి దివ్య రధములో దివి నుండి భువికి వచ్చాడు.
నాలుగు తురగములు, ఏనుగులను పూన్చి ఉన్నఆ దివ్య రధము అది.
స్వర్గమునుండి ఆ తేరులో తన భక్తుని వద్దకు దిగివచ్చాడు స్వామి.
శ్రీ మహా విష్ణుమూర్తి అనుగ్రహమును పొందిన
హేమఋషి ఆశ్రమము ఉన్నచోట
"మహా మాగ కొలం"  కొలను వెలసినది.
దానికి "పొత్రమరై" (Potra marai kulam)
 "మహా మాగ కొలం", "పోత్రమరై కులం" అనే నీటి సరసులు ఉన్నవి.
ఈ సరోవర ద్వయానికి ఉద్భవ గాధ కలదు.

************************,

శ్రీ సారంగపాణి కోవెల ఉన్న ఊరు "తిరుక్కుండతై".
ఈ కోవెల "కుంభకోణము" నకు
ఒకటిన్నర మైలు దూరాన ఉన్నది.
స్థల పురాణము ప్రకార గాధలు కొన్ని కలవు.
ప్రళయవేళల బ్రహ్మదేవుని భుజాలపై ఉన్న బాధ్యత "సృష్టి పునర్ నిర్మాణము".
అందుకై సృష్టికర్త - అమృతము మొదలైన సామగ్రిని సేకరించాడు.
విరించి తన సేకరణలను ఒక కుండలో నింపాడు.
ఆ మట్టికుండను "మేరు పర్వత శిఖరము" (Mountain Meru) పైన
విరించి జాగ్రత్తగా అట్టిపెట్టాడు.
ప్రళయ కాలం వచ్చి, తెంపులేని వర్షాలతో అతలాకుతలం అవసాగింది.
బ్రహ్మ - అమూల్య వస్తు పూర్ణకుంభమును జాగ్రత్తగా రక్షించ పూనుకున్నాడు.
వరదభీభత్సాలనుండి
కుంభపరిరక్షణ - తక్షణ కర్తవ్య దేవతలు కైలాసమునకు వెళ్ళారు.
దివ్యుల కోరికపై - భవుడు శరసంధానము చేసాడు.
నారి సారించి, అంబును విడిచాడు సాంబసదాశివుడు.
మహేశుడు విడిచిన బాణము కుండను తాకింది.
కుండ బ్రద్దలై  అందులోని సుధారసము అక్కడ రెండు భాగాలుగా పడినది.
అవే "మహా మాగ కొలం", "పోత్రమరై కులం" అనే రెండు కొలనులు.
శ్రీ సారంగపాణి ( ఆరావముదన్ ) కోవెల ఇక్కడ వెలిసినది.
 కుంభకోణమునకు 1 1/2 మైళ్ళు దూరములో
ఈ ";తిరు కుండతై Thirukkudanthai " ఉన్నది.
కుంభము భగ్నమైన చోటు –
కనుక “కుంభ కోణము”/ కుండతై (Kundatai) అనే పేరు వచ్చి,
నేడు పుణ్యతీర్ధముగా విలసిల్లుచున్నది)

************************,

మూలవరులు:- Thirukudanthai శ్రీ సారంగపాణి:
శ్రీ మహా విష్ణు ధనుస్సు పేరు "శార్ఙ్గము"
అందుచే ఈ స్వామి పేరు "సారంగపాణి".
ఈ స్వామి - ఆరా అముధన్, అభయాప్త మిరుతన్, ఉత్థాన శాయి
మున్నగు పేర్లతో కీర్తించబడుతున్నాడు.
హేమమహర్షికి  ప్రత్యక్షమైనది ఈ చోటులోనే!
మూలవరులు ఉద్యోగశయన భంగిమలో ఉన్నారు,
అనగా అప్పుడే నిద్రనుండి మేల్కొన్న పొజిషన్ లో ఉన్నారు.
కోమలవల్లీ తాయారు ఈ కోవెలలో
మరొక దర్శన అభయ వరప్రదాయిని ఐ,
భక్తులను అనుగ్రహిస్తూన్నది.

Sri Komalavalli Thayar. Also called as
"Padi Thanda Pathini" ie thayaar
would never (leave out) or leave away from her chamber.
She has her own seperate sannadhi in this temple.

************************,


తిరుపతి, శ్రీరంగం, కాటుమన్నార్ కోవిల్,
ఆల్వార్ తిరునగరి, తిరువెల్లారై, తిరుకండియూర్,
తిరుపుల్లాం భూతం కుడి మున్నగు వాని వలె -
"పరంధామ క్షేత్రము".
"శంఖ చక్ర గదా పాణిం అహం వందే|
  శ్రీ శార్ఙ్గ నందక కౌస్తుభ ధారిణం వందే||"
        (ముత్తుస్వామి  దీక్షితర్ కృతి)
************************,




Tags:-

(Thirupati, SriRangam, Kaatu Mannar Kovil,
Alwar Thirunagari, Thruvellarai, Thiruvekka,
Thiru Kandiyur, ThiruKarambanoor,
Thiruputkuzhi and Thirupullamboothamkudi.
This place is treated a
s the place which explains
the meaning of "Paramathma Thathuvam")

(Kaveri River ,Arasalar)

************************,
Thirukkudanthai   (Link)
Thirukkudanthai  - Sri Sarangapani Perumal Temple

Tags:-
Maha magha kulam, Potra marai kulam
temple is Sri Sarangapani. Aara Amudhan,
Abayaryaapthamiruthan and Utthanasayi

ర్ఙ్గ "r~mga ;