కుంతీ పుత్రో వినాయకః ;-
గత దశాబ్దం వఱకు "కాపీ కొట్టుట" అనే మాట తఱచూ చర్చించబడేది.
"గ్రంధ చౌర్యము" అనే అంశము వలన వాదోప వాదాలు జరుగుతూండేవి.
రచన, సాహిత్య వర్గాలలో ఈ విషయమై ఇలాగ "గ్రంధ చౌర్యము, కాపీ కొట్టడము" లాంటి పదాలు
వాడుకలో ఉన్నాయి.
ఐతే సంగీత, నాట్యాది ఇతర కళలలో కూడా కాపీ సాధారణమే ఐనప్పటికీ,
అచ్చట ఇలాంటి ప్రత్యేక పదమేదీ వాడుకలో ఉన్నట్టు కనుపట్టదు.
*** *** ***
ప్రాచీన లాక్షణికులు
"నాస్తి చోరః కవి జనాః" అనేశారు.
"చౌర్యం" అనే మాట సారస్వత వర్గాలలోనే మరింత ప్రాచుర్యములో ఉండటానికి కారణమేమిటి?
సమాజంలో అభిప్రాయాలను రూపొందించడము, రచనల ద్వారా సత్వరమే సాధ్య పడుతూన్నది.
కలం బలంతో, ప్రభుత్వాలనే మార్చిన సంఘటనలు ప్రపంచ చరిత్రలో ఉంటూన్నాయి కాబట్టి, ఇతర కళల కన్నా "కలం బలమే మిన్న, అతి శక్తి మంతము" అని తోస్తూన్నది. ఈ కాపీ కొట్టడమనేది సినిమాలలో సుస్పష్టంగా గోచరిస్తూంటున్నది.
సినీ ప్రపంచము సర్వ కళా సమన్వయ వేదిక! కాబట్టే, అక్కడ కథ, సంభాషణలు, సంగీతము, డాన్సు, కెమేరా ఇలా ఒకటేమిటి, దాదాపు అన్ని కోణాలలోనూ కాస్తో కూస్తో కొండొకచో దాదాపు అంతా "కాపీ" వ్యవహారం విస్పష్టంగానే ఉంటుంది. అత్యంత ఖరీదైనది కాబట్టి ఇది రమా రమిగా ఆమోదించ బడ్తూన్నది కూడా!
"దేవ దాసు" వంటి (శరత్ చంద్ర ఛటర్జీ )నవలలు కొద్ది కొద్ది మార్పులతో, అనేక పర్యాయాలు వెండితెరకు ఎక్కి విజయ భేరీని మ్రోగించినాయి కదా!
*** *** ***
ఐతే "రచనలు, కళలు ఎంత మేఱకు కాపీ చేయ వచ్చును?" అని అభిజ్ఞుల ప్రశ్నయే ఇప్పుడు వ్యాసానికి ప్రాతి పదిక. "కాపీ కొట్టడమే తప్పు" ఇది నిర్వివాదాంశమే! తమాషా ఏమిటంటే, కొన్ని సార్లు మూల రచయిత/కళా సృజన కర్తలకు ఈ పరిణామం అతి విచిత్రంగా, మూల కర్తలకు "భక్తితో ఒసగే హారతి" గా పరిఢవిల్లుతూన్నది.
;;
AF - ఇతిహాస దరహాస చాటువులు Essay ; LINK ;
My File - Documents - 2010 KONamAnini ;;;;;;;;;;;;

"అబద్ధం వా సుబద్ధం వా కుంతీ పుత్రో వినాయకః||""అనుకరణ" ను, కాపీ చేయడాన్ని ఆమోదించినప్పటికీ, మూల కర్తలకు "కృతజ్ఞతలను" ప్రకటించాలి. అది వారి సంస్కారానికి నిదర్శనమే కదా!