Sunday, June 4, 2017

రేపల్లెలోన ఇందుబింబం

నింగి ఇందుబింబమును కికురించుచు ;
బ్రహ్మ కమలమిందు విరిసె వ్రేపల్లియలోన; || 
;
క్రిష్ణ, రాధికలు నడి మధ్యన ; 
చుట్టూతా వలయములై ;
గోపికా భామినులు
నింగి ఇందుబింబమును కికురించుచు ;
బ్రహ్మ కమలమిందు విరిసె వ్రేపల్లెలోన ; || 
;
రాసలీల వలయాలు ;
చుట్టూతా వలయములై ;
గోపికా భామినులు
నింగి ఇందుబింబమును కికురించుచు ;
బ్రహ్మ కమలమిందు విరిసె వ్రేపల్లెలోన ; ||  
;

వయ్యారపు హైలెస్సా

రంగ రంగ శ్రీరంగా ; నదిలోన హైలెస్సా!
సాగిపోతున్నదోయి వయ్యారపు హైలెస్సా ; || 
;
పల్లీయుల నగవులు ; 
మల్లెల విరి చేవ్రాళ్ళు ; 
పల్లెపట్టు వికాసాలు ; 
సాగిపోతున్నదోయి వయ్యారపు హైలెస్సా ;
అలా అలా అలల పైన సాగిపోతున్నదోయి! ; ||
;
యమున ఝరి హంస పడవ- 
నావ నెక్కి, ఉన్నారు ; 
వ్రేపల్లె జనమంతా - 
సాగిపోతున్నదోయి వయ్యారపు హైలెస్సా ;
రంగా రంగా శ్రీరంగా ; నదిలోన హైలెస్సా !!! || 
;
పల్లీయులు నేస్తాలు ; 
కిలకిలల నవ్వుల ; 
కళ కళల నావ ఇది; 
దిక్సూచి క్రిష్ణ హాస తర్జని ; ; 
అలా అలా అలల పైన సాగిపోతున్నదోయి ; ||
;
✿~🎵🕡✳️⚙️ శుభ ఉషస్సు ; शुभोदयम ; gud marning 
LINK KSM :- jallu - 1