పూలూ పూలూ ;
తగవులు ఏల? ;
మందారపు తావియె ;
క్రిష్ణ నివాసము ఆయెననీ : ||
అష్ట మహిషులు అల్లిరి దండలు ;
రుక్మిణి తెచ్చెను మల్లెల దండలు ;
సత్యభామ కరమున ;
పారిజాతముల విరుల దండలు ; ||
కౌస్తుభ మణులు, మౌక్తికాభరణములు ;
కన్నని మేనున ఉన్నా గాని ;
ఎన్ని ఉన్నా గాని ;
మీ పువ్వుల తరళతలకు ;
సమ ఉజ్జీలగునా!? ||
;
రవ్వల కళలు , తళతళలు
మీ దళముల తేనెల
సాటి ఔతాయా ఏమి!?
రుసరుస అలుకలు మానండీ ;
మీ సుమ హాసములతొ
మా వసుధను యావత్తూ ;
కళకళలాడించండీ!
మేలుగ కళకళ లాడించండీ!! : ||
;
⍏ - పుష్ప మంజరి తరళతలు ;