Monday, November 30, 2015

ధర్మస్థల - who give name?

ధర్మస్థల' పుణ్య క్షేత్రమునకు ముందు ఉన్న పేరు ఏమిటి? :-
, 'ధర్మస్థల' అను నామమును ఎవరు పెట్టారు?
ధర్మస్థల - who give name?  :-
"మంజునాధ" సినిమా 2001 లో రిలీజ్ ఐనది. 
ఇందులో అర్జున్, సౌందర్య, చిరంజీవి నటించారు.
"మహా ప్రాణదీపం, శివం శివం ...... " ; "ఓహో! గరళ కంఠ! నీ మాటంటే ఒళ్ళు మంట"
పాటలు, నాట్యాల పోటీలలో 
{'ఢీ' ఎట్సెట్రా టి వి ప్రోగ్రాములలో] అభ్యర్ధులు నర్తిస్తున్నారు.
మంజునాధ కోవెల ఉన్న గ్రామములో జరిగిన 
యదార్ధ సంఘట ఆధారంగా తీసిన సినిమా ఇది.
&&&&&&&&&&&

ముందు కొన్ని ముఖ్య విశేషములను తెలుసుకుని, 
ముందుకు సాగుదాము! 
ఈ కోవెలకు సంబంధించిన ప్రత్యేకత ఉన్నది. 
జైనులు ఈ హిందూ ఆలయ ధర్మకర్తలు.
ఆలయ ధర్మకర్త హెగ్డే.
&&&&&&&&&&&

శివుడు, మంజునాథుడు, అమ్మనవరు, చంద్రనాథ ; 
కళారాలు అనే ధర్మదైవాలు (ధర్మరక్షణ దైవాలు) , 
కుమారస్వామి మరియు కన్యాకుమారి 
మొదలైన దైవాల సన్నిధులు ఈ ఆలయంలోఉన్నాయి. 
ఈ ఆలయనిర్వహణ జైన్ మతస్థుల ఆధ్వర్యంలో - 
పూజాదికాలు హిందూ పూజారులచేత నిర్వహించబడుతూ ఉన్నాయి.
&&&&&&&&&&&

ఈ కోవెలలో జైనతీర్థంకరుల సేవలను ధర్మదేవతలతో -
మంజునాథుడు కూడా అందుకుంటున్నాడు. 
ఇక్కడ పూజారులు వైష్ణవబ్రాహ్మణులు. 
1] దైవవాక్కు పలికే వారిని 
డెలాపాదిత్య మరియు మనవొలిత్యాయ అంటారు.
2] పర్గాడే కుటుంబం ; జైన్ సైనికాధికారి బిర్మన్నా ,
అతని భార్య అయిన అమ్ము బల్లాథి , 
ధర్మదేవతల ఆనతిని పాటించి, 
తమ గృహమును ఆలయమునకు ఇచ్చి, 
తాము వేరే ఇల్లును మళ్ళీ కట్టుకున్నారు.
3] 800 సంవత్సరాలకు ముందు ధర్మస్థలను 
మల్లర్మడిలోని 'కుడుమా' గా గుర్తిస్తూ ఉండేవారు. 
తరువాత ఇది బెళ్తంగడిలో ఒక గ్రామంగా మారింది. 
ఈ ఊరు నీతి, నిజాయితీలకు మారుపేరు ఐనది. 
4] ధర్మస్థల , అను నామమును ఎవరు పెట్టారు? :-:-
ధర్మస్థల , అను నామమును ఉంచిన ముని శ్రీవాదిరాజస్వామి.
శ్రీవాదిరాజస్వామి మధ్వాచార విధితో పునఃప్రతిష్ఠ చేయాడానికి అవసరమైన పూజాకార్యక్రమాలను ప్రారంభించారు. 
తరువాత శ్రీవాదిరాజస్వామి ఈ ప్రదేశానికి ధర్మస్థల అని నామకరణం చేసాడు. ధర్మస్థల అంటే మతం మరియు ధర్మము ఉండే ప్రదేశమని అర్థం. 
6] 600 సంవత్సరాలకు ముందు ధర్మానికి మరియు మతానికి పడిన పునాది హెగడే కుటుంబం వేసి, అభివృద్ధి చేసారు. 
పర్గాడే నుండి హెగడే పదం ఆవిర్భవించింది. ప్రస్తుతం ధర్మస్థల నిస్వార్ధసేవకు చిహ్నంగా నిలిచింది.
7] గ్రామదేవత :- ధర్మస్థల ప్రజలు, 
అణ్ణప్ప దైవాన్ని గ్రామదేవత పంజుర్లిగా ఆరాధిస్తున్నారు
&&&&&&&&&&&

Manjusha Musium :-
ధర్మస్థల లో టూరిస్టులు ఇష్టంగా చూడవలసిన అదనపు విశేషాలు ఉన్నవి. "మంజూష మ్యూజియ", 
దీనికి అనుబంధంగా "మనూషా ప్రదర్శనశాల"- 
[Manusha Cars museum] ఉన్నవి.
*****************************
] ధర్మస్థల, new name    { LINK  }        

] ధర్మస్థల - who give name? ; ] ముని శ్రీవాదిరాజస్వామి
 'కుడుమా' ;- (మల్లర్మడి; బెళ్తంగడి) ;
[ FB :-  November 5 at 11:42pm · ;  Kusuma Piduri‎ ;
                మన సంస్కృతి - ఆచారాలు, సంప్రదాయాలు :- ప్రాచీన రత్నమాల - 1 ]

No comments:

Post a Comment