Monday, November 30, 2015

ధర్మస్థల - who give name?

ధర్మస్థల' పుణ్య క్షేత్రమునకు ముందు ఉన్న పేరు ఏమిటి? :-
, 'ధర్మస్థల' అను నామమును ఎవరు పెట్టారు?
ధర్మస్థల - who give name?  :-
"మంజునాధ" సినిమా 2001 లో రిలీజ్ ఐనది. 
ఇందులో అర్జున్, సౌందర్య, చిరంజీవి నటించారు.
"మహా ప్రాణదీపం, శివం శివం ...... " ; "ఓహో! గరళ కంఠ! నీ మాటంటే ఒళ్ళు మంట"
పాటలు, నాట్యాల పోటీలలో 
{'ఢీ' ఎట్సెట్రా టి వి ప్రోగ్రాములలో] అభ్యర్ధులు నర్తిస్తున్నారు.
మంజునాధ కోవెల ఉన్న గ్రామములో జరిగిన 
యదార్ధ సంఘట ఆధారంగా తీసిన సినిమా ఇది.
&&&&&&&&&&&

ముందు కొన్ని ముఖ్య విశేషములను తెలుసుకుని, 
ముందుకు సాగుదాము! 
ఈ కోవెలకు సంబంధించిన ప్రత్యేకత ఉన్నది. 
జైనులు ఈ హిందూ ఆలయ ధర్మకర్తలు.
ఆలయ ధర్మకర్త హెగ్డే.
&&&&&&&&&&&

శివుడు, మంజునాథుడు, అమ్మనవరు, చంద్రనాథ ; 
కళారాలు అనే ధర్మదైవాలు (ధర్మరక్షణ దైవాలు) , 
కుమారస్వామి మరియు కన్యాకుమారి 
మొదలైన దైవాల సన్నిధులు ఈ ఆలయంలోఉన్నాయి. 
ఈ ఆలయనిర్వహణ జైన్ మతస్థుల ఆధ్వర్యంలో - 
పూజాదికాలు హిందూ పూజారులచేత నిర్వహించబడుతూ ఉన్నాయి.
&&&&&&&&&&&

ఈ కోవెలలో జైనతీర్థంకరుల సేవలను ధర్మదేవతలతో -
మంజునాథుడు కూడా అందుకుంటున్నాడు. 
ఇక్కడ పూజారులు వైష్ణవబ్రాహ్మణులు. 
1] దైవవాక్కు పలికే వారిని 
డెలాపాదిత్య మరియు మనవొలిత్యాయ అంటారు.
2] పర్గాడే కుటుంబం ; జైన్ సైనికాధికారి బిర్మన్నా ,
అతని భార్య అయిన అమ్ము బల్లాథి , 
ధర్మదేవతల ఆనతిని పాటించి, 
తమ గృహమును ఆలయమునకు ఇచ్చి, 
తాము వేరే ఇల్లును మళ్ళీ కట్టుకున్నారు.
3] 800 సంవత్సరాలకు ముందు ధర్మస్థలను 
మల్లర్మడిలోని 'కుడుమా' గా గుర్తిస్తూ ఉండేవారు. 
తరువాత ఇది బెళ్తంగడిలో ఒక గ్రామంగా మారింది. 
ఈ ఊరు నీతి, నిజాయితీలకు మారుపేరు ఐనది. 
4] ధర్మస్థల , అను నామమును ఎవరు పెట్టారు? :-:-
ధర్మస్థల , అను నామమును ఉంచిన ముని శ్రీవాదిరాజస్వామి.
శ్రీవాదిరాజస్వామి మధ్వాచార విధితో పునఃప్రతిష్ఠ చేయాడానికి అవసరమైన పూజాకార్యక్రమాలను ప్రారంభించారు. 
తరువాత శ్రీవాదిరాజస్వామి ఈ ప్రదేశానికి ధర్మస్థల అని నామకరణం చేసాడు. ధర్మస్థల అంటే మతం మరియు ధర్మము ఉండే ప్రదేశమని అర్థం. 
6] 600 సంవత్సరాలకు ముందు ధర్మానికి మరియు మతానికి పడిన పునాది హెగడే కుటుంబం వేసి, అభివృద్ధి చేసారు. 
పర్గాడే నుండి హెగడే పదం ఆవిర్భవించింది. ప్రస్తుతం ధర్మస్థల నిస్వార్ధసేవకు చిహ్నంగా నిలిచింది.
7] గ్రామదేవత :- ధర్మస్థల ప్రజలు, 
అణ్ణప్ప దైవాన్ని గ్రామదేవత పంజుర్లిగా ఆరాధిస్తున్నారు
&&&&&&&&&&&

Manjusha Musium :-
ధర్మస్థల లో టూరిస్టులు ఇష్టంగా చూడవలసిన అదనపు విశేషాలు ఉన్నవి. "మంజూష మ్యూజియ", 
దీనికి అనుబంధంగా "మనూషా ప్రదర్శనశాల"- 
[Manusha Cars museum] ఉన్నవి.
*****************************
] ధర్మస్థల, new name    { LINK  }        

] ధర్మస్థల - who give name? ; ] ముని శ్రీవాదిరాజస్వామి
 'కుడుమా' ;- (మల్లర్మడి; బెళ్తంగడి) ;
[ FB :-  November 5 at 11:42pm · ;  Kusuma Piduri‎ ;
                మన సంస్కృతి - ఆచారాలు, సంప్రదాయాలు :- ప్రాచీన రత్నమాల - 1 ]

Wednesday, November 11, 2015

దీపావళి శుభాకాంక్షలు!

 దీపావళి శుభాకాంక్షలు! 

 దీపావళి శుభాకాంక్షలు! 2015 


Tuesday, November 10, 2015

షట్కోణ = six జోకులు - part 1

1] జూలో డాల్ఫిన్ ను చూపిస్తానన్నావు కదా నాన్నా!
#dolls#, బొమ్మల
షాపులు ఏవీ ఎక్కడ? కనబడట్లేదు"
అడిగాడు బుడుగు ఇజీక్వల్టు = సిసింద్రీ.
"ఓయ్ బాబూ! ఫిన్ లూ, డాల్సు, బొమ్మలూ - వేర్వేరు కాదురా,
డాల్ఫిన్ ఒకటే పెద్ద చేప! "
డాడీ విడమరిచి నొక్కి చెప్పిన వక్కాణం.

********************;

2]  "ఇది కొత్త ప్రకటన" ఆర్టిస్టుకు చూపిస్తూ చెప్పసాగాడు యజమాని ;
:ఈ ఫొటోలోని పో'లిక రూ'పొందించు!"
"ఓ! లిక్కరు ఇస్తేనే నా బ్రష్షు ముందుకు
సాగుతుంది." మందుబాబు '
'బీర'య్య జోగుతూ అన్నాడు నిష్కర్షగా!

********************;

3] చంద్రగోళం మీద కొత్త రాకెట్ నుండి దిగిగిన పాసెంజర్ తో మాటలు
కలిపాడు,
గంట తర్వాత అతడు మాస్కును / హెల్మెట్ నీ తీసి గాలి పీల్చుకున్నాడు.
"ఓరి నువ్వట్రా కిట్టూ! చిలకలూరిపేటలో ఎలిమెంటరీ స్కూలులో లాస్టు బెంచీలో కూర్చుని, జీళ్ళు తింటూ కూర్చునే వాళ్ళం, గుర్తుందా?"

"ఓరి నువ్వా కృష్ణుడూ! ఇందాకట్నించీ శిరస్త్రాణం ధరించి ఉన్నాము. హెల్మెట్టులో నిన్ను ఆనవాలు పట్టలేదు, ఏ అండమాన్  అబ్బాయివో అనుకుnnaaను."

********************;

4] chEpalu unnay! pilli ni kaTTey Dhaamm //;

"మీ పెంపుడు పిల్లిని కట్టేసారు, ఎందుకని?"
"ఏం చేయను మరి?
మా పిల్లలు 'ఆక్వేరియాన్ని' కొనుక్కొచ్చారు, 'చేపలతో సహా'!
" మిత్రుని ధర్మసందేహాన్ని నివృత్తి చేస్తూచెప్పాడు మార్తాండం.

********************;

5] "మా వారు బంగారు పతకాలను బోలెడు సంపాదించారు."
మెడల్సునీ ఫొటోలనీ చూపించసాగింది సాగరిక సంతోషంతో, గర్వంగా.

"ఓస్ ఇంతేనా! మా వారు పార్టీ పతాకాలు, జెండాలు చాలా అట్టిపెట్టుకుని
ఉంటారు, ఇంట్లో, ఎప్పుడూ రెడీగా, భద్రంగా!"

********************;

6] "ఇదేంటి అంకుల్! కొత్తరకం పట్టుకారా, మెత్తగా భలేగా ఉంది."
టేబులు మీద డాక్టరు పెట్టిన వస్తువును తీసుకుని ఊగులాడిస్తూ
అడిగింది కొత్త పేషంటు,

"కాదు! అది డాక్టరు పెట్టిన స్కెతస్కోపు."
- ఎర్రగడ్డ హాస్పిటల్ లో - నర్సు
 పేషంటును సముదాయిస్తూ స్కెతస్కోపుని నిమ్మళంగా తీసుకున్నది.

*************************************************************,
[షట్కోణ = six జోకులు ; 

Thursday, November 5, 2015

పూలజడ, మధురై మల్లెలు

పూలజడ - అనగానే "మల్లెపూల జడ" అనే అర్ధం మాత్రమే స్ఫురిస్తుంది. 
"ముద్దబంతి పూలు పెట్టి ; మొగలిరేకులు ;
  జడను చుట్టి; హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మా! 
.......... " అనే పాట , మాస్టర్ వేణు మ్యూజిక్ బాణీలో , సూపర్ సాంగ్ . 
"కలసి ఉంటే కలదు సుఖం " సినిమాలోది ఈ గీతం. 
ఇక్కడ "మొగలి రేకులు" - అని గీత రచయిత [?] ఉవాచ. 
;
*******************************,
మధురై మల్లెలు - three weeks దాకా వసివాడకుండా ఉంటాయి. 
అంత విలక్షణత ఉన్నవి, 
కాబట్టే, "Madhurai mallige" లకు కాపీరైటు, ప్రాంతీయ స్వీయ హక్కు - ను పేటెంట్ 
తీసుకున్నారు, ఆ మల్లెతోటల, వ్యాపార భాగస్వాములు.
***********************, 
ప్రస్తుతం, వక్తవ్యాంశం ;- ‘మొగ్గిన జడే’ - 
కిందటి నెల, రాత్రి 11 గంటలకు వచ్చిన కన్నడ 
సినిమా "‘మొగ్గిన జడే’"- చూసాను.
ఆ సినిమా - Moggina Jade – ಮೊಗ್ಗಿನ ಜಡೆ (2008/೨೦೦೮); 
నాకు ఎంతో నచ్చింది. ‘మొగ్గిన జడే’ = (మల్లె)మొగ్గల జడ - అని అనవచ్చును.  
‘మొగ్గిన జడే’ – అంటే ‘పూల జడ’; స్థూలంగా కథ . 
పదేళ్ళ చిన్నారి ప్రియకు ‘పూల జడ’ వేయించుకోవాలని చాలా కోరిక. 
ఈ స్పీడు యుగంలో - ఆధునికధోరణులు విసృతమౌతున్న ఈ రోజులలో - ఒంటరితనానికి 
గురి ఐన చిన్నారి పరిస్థితి తికమకలలుగా ఔతుంది. ఉద్యోగిని ఐన ఆమె తల్లి, చిన్నారి 
"ప్రియ" సంరక్షణకు ఉంచిన అమ్మాయి, సరిగ్గా చూడదు. 
ప్రేమరాహిత్య బాధతో సతమతమౌతూన్న ప్రియ, రోడ్డు పక్కన దొమ్మరాటలాడే పిల్లల స్నేహం చేస్తుంది. సహజంగానే ప్రియ అమ్మ నాన్నలు కుమార్తెని కోప్పడతారు. 
................ 
ఇట్లాగ కథ మలుపులు తిరిగి, కథ సుఖాంతం ఔతుంది. 
"‘మొగ్గిన జడే’" 2008 లో రిలీజ్ ఐనది. 
ఇండియన్ పనోరమా, బాలల చిత్రం - అవార్డులను గెలిచిన మూవీ ఇది. 
విచిత్రంగా - గూగుల్ ప్రపంచంలో - వీడియో మాత్రం లభించలేదు.
ఇంత మంచి చలనచిత్రం - వీడియో - ఉండకపోతే ఎట్లాగ?
ఎవరైనా, ప్రయత్నించి, అందరికీ , ఆ movie ని ప్రేక్షకులకు అందుబాటులోనికి తీసుకురండి! ప్లీజ్!
*********************************,
పనిలో పని :- పూలజడ - ను ఎట్లాగ వేయవచ్చునో , ఒక వీడియోలో చూద్దాము, పదండి! 
********************************;

మధురై మల్లెలు in=  FB సాహిత్యం  
‎Kusuma Piduri‎ to సాహిత్యం ; October 12 at 8:57am ·;- 
********************************;
అఖిలవనిత
Pageview chart 33657 pageviews - 820 posts, last published on Oct 12, 2015
;