మువ్వగోపాలునికి తెలుసు
ఈ మధుర ధ్వని సంగీతము
మధురలో దొరకునా?
వ్రేపల్లెలోన మాత్రమే
దక్కెడి రాగ సౌభాగ్య గరిమ - అనీ ||
;
బాల క్రిష్ణు, ఆట పాటలందున
వెండి గజ్జెలు, అందెలు; మువ్వలు
చిరు సవ్వడిలో తడిసెను
ప్రతి కదలిక; పద కింకిణి నిక్వాణము
నొందినదీ ప్రతి మువ్వయు ;
||మువ్వగోపాలునికి ||
;
ఎడద మలుపు మలుపులలో:
ప్రతి తలపుయు "భోగ్" ఆయెను;
ప్రతి ఊసు ప్రసాదమ్ము!
లల్లాయి పల్లాయి కబురులు సైతం
నైవేద్యం, కైంకర్యాలగును గదా చోద్యంగా!
||మువ్వగోపాలునికి ||
*************************************************************
; = [భోగ్ = పసాదము] भगवान को भोग] :-
*************************************************************
[రచన :- కుసుమాంబ1955] [8:11 PM 9/3/2015]
*************************************************************
పాట;- పాట;- పాట;- [f. b. group]
కృష్ణం వందే జగద్గురుం A Magazine of Shri Krishna
[8:11పి. ఎమ్. , సెప్టెంబర్ 9/3/2015]
-----------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment