తారావళి తోడ బంతులాటలు; బూజం బంతులాటలు బువ్వ బూజం బంతులాటల్లు ఆడుదము రండి!
వేడ్కతో మనము క్రీడలకు చక్కని పదములౌదాము
, పర్యాయ పదములౌదాము ||
;
నీలాలనింగిలో; మందంగ ఉన్నట్టి
తెలి మబ్బులటనటను తేలుతూ ఉన్నవి,
- నటనాలు ఆడుతూ ఉన్నవి
నురుగుల మబ్బుల అల్లరుల ఆడంగ ;
వేడ్కతో రండి చెలియల్లార!
క్రీడలకు చక్కని పదములౌదాము
పర్యాయ పదములౌదాము||
;
మన జడపాయలందలి జాజి మల్లెల - విరుల ;
రజత పాత్రలలోను తెచ్చుకుందాము
జాగ్రత్తగాను తెచ్చుకుందాము
ఇంచక్క నీరదం హిమరాశులను తేగ ;
వేడ్కతో రండి చెలియల్లార!
క్రీడలకు చక్కని పదములౌదాము
పర్యాయ పదములౌదాము ||
;
ఆ నీరదమ్ములందున దూరి ;
జలదముల బాష్పముల "ఆవిరులు" పట్టి;
మంచు వడగళ్ళను ఏరి తెద్దాము!
మనదు పిడికిళ్ళలోన ఒడిసి పట్టదము;
చిత్రాల బొమ్మల బంతులాటలకై
వేడ్కతో రండి చెలియల్లార!
క్రీడలకు చక్కని పదములౌదాము
పర్యాయ పదములౌదాము ||
;
{posted - 10:17 AM 9/18/2015 ; [కృష్ణాతరంగాలు]; }
[ గీతరచన :- [ కుసుమాంబ 1955 ] =
Kusuma Piduri to కృష్ణాతరంగాలు
September 18 at 10:16am ·