వినోద, విజ్ఞాన, విహ్వలతలను
విరబూసేటి కల్పలత కదా
- మన ఇంటర్ నెట్!
ఈత రానివారిని సైతం,
గజ ఈతగాళ్ళవలె మలిచేను
- ఫేస్ బుక్ నేస్తం!
నవరసభావ వర్ణనా విచిత్ర వర్ణ మాలికలను
చదువరులకు పంచిఇచ్చేను కంప్యూటర్ లోకం!
గుదిగుచ్చిన పూవుల ఘుమఘుమ చెండ్లను;
సినీ వార్తల పల్యంకిక ఇది;
నవ వధూవరులవలె పాఠకులౌదురు!
బూజం బంతి చెండ్లాటలను తలపించేను;
మేజువాణీ నర్తనశాలలు చక్కని బ్లాగులు;
మూజువాణీల ఓట్ల పేటికలు ట్విట్టర్, లింకులు
లింక్ డెన్ లోగిలి చెమ్మచెక్కలు, పిల్లిమొగ్గలు;
వెబ్ పత్రికల పూలగొడుగులు;
ఓమ్ నమః శివాయ! సిద్ధం నమః॥
అంటూ,
బరులను దిద్దిన నాటి బాల్యము
చివురులు వేసెను మునివ్రేళ్ళన్;
మరచి పోబోతున్న అక్షరమాలను
Type న దిద్దించేను కీబోర్డు, మౌసులు;
ఏకపంక్తిని గురు, శిష్యులకు
లభించు కమ్మని విందు భోజనము!
సకలశాస్త్రముల లోగిలి ఈ-నెట్!
సర్వభాషల నగిషీఅల్లిక తోరణమ్ములను
దాల్చిన సింహద్వారము పలుకునెల్లెడల
"సుస్వాగతము!" - సరిగమ పదనిస
గమకములొలుకగ, బహు గమ్మత్తుగ!
నిఖిలావనికీ నిండు వేదిక ఇది!
*****************************,
stars dots designs |
- (గుణింతాల ఒజ్జ - ఇంటర్ నెట్ )
(- కాదంబరికుసుమాంబ శ్రీ ){views; 21615;
57533 - konamanini} - 8:14 AM 11/30/2014
No comments:
Post a Comment