Tuesday, September 9, 2014

యశోదమ్మ చేతి చలువ

నీ చేతి చలువను ఎల్లరు జనులు
మెచ్చుకుందురు ఓ అమ్మా!
తెగ మెచ్చుచున్నారు ఓ యశోదమాతా! ||

వాడల వనితలు; యమునాజలముల ;
గాగులలోన పోసారు;          
లాలలు పోయి, ఓ అమ్మా!
గోరువెచ్చనీ లాలలు పోయి ఓ అమ్మా!
లాలలు పోసి తిలకము దిద్దు, ఓ అమ్మా!!  
కస్తూరి తిలకము దిద్దు! ఓ జననీ! ||

బంగరు అన్న మా బలరాముడు;
కొలనుతామరలు తెచ్చెను అన్న;  
నెమలిపింఛమును ఇచ్చెను రాధ!      
దబ్బున సిగముడి వేయమ్మా!      
తామర, కలువలు, ఈకలన్నిటినీ;    
నా కురులందున ముడువమ్మా! ||
               
&&&&&&&&&&&&&&&&

 __/|\__  __/|\__  __/|\__  __/|\__  __/|\__  __/|\__ 

కోణమానిని వ్యూస్:- 56721 ( 9 సెప్టెంబర్ 2014 మంగళవారం) 
56876 గురువారం, 11 సెప్టెంబర్ 2014)

__/|\__  __/|\__  __/|\__  __/|\__  __/|\__  __/|\__ 


ఇద్దరు శ్రీకృష్ణులు
;

No comments:

Post a Comment