Thursday, September 25, 2014

నవ దవన నవరాత్రి

చరణముల అందియలు ఘలు ఘల్లుమనగా
నటరాజదేవేరి! హంసగమనమ్మున
విచ్చేయవమ్మా! మా ఇంటికి,
నవ నవ దవనము సరదాల దసరా
నవరాత్రి పర్వము; నవరసభరితము!  || 
కుందులు తెచ్చారు,
తెచ్చి, ఒత్తులు వేసారు,
వేసి, వెలిగించినారు భక్తితో  - ప్రజలు;  ...........
;
కుందులు తెచ్చారు, ఒత్తులు వేసారు,
తైలమును పోసి, వెలిగించినారు
భక్తితో ప్రజలు; జ్యోతి కళకళలాట :
నవ నవ దవనము సరదాల దసరా
నవరాత్రి పర్వము; నవరసభరితము!||   
కుందనపు బొమ్మ శ్రీ కనకదుర్గమ్మ;
దరహాసముల కాంతి, లక్ష ప్రమిదలలోన
శాంతిబింబమ్ములు ముమ్మరమ్మాయెను,
నవ నవ దవనము సరదాల దసరా
నవరాత్రి పర్వము; నవరసభరితము!  ||  
అనురాగవల్లి/ ల్లీ! ఆనందదాయినీ!
మొల్లల మాలికలు;తెలి కాంతి దూతలు
మల్లెల వానలు నీ - చల్లని చూపులు
నవ నవ దవనము సరదాల దసరా
నవరాత్రి పర్వము; నవరసభరితము!  ||   

***********************************,
;
Table Cloth design - 1 


అఖిలవనిత
పేజీ వీక్షణ చార్ట్ 27794 పేజీవీక్షణలు - 722 పోస్ట్‌లు, చివరగా Sep 11, 2014న ప్రచురించబడింది
;
కోణమానిని తెలుగు ప్రపంచం
పేజీ వీక్షణ చార్ట్ 52883 పేజీవీక్షణలు - 995 పోస్ట్‌లు, చివరగా Sep 9, 2014న ప్రచురించబడింది
;
Telugu Ratna Malika
పేజీ వీక్షణ చార్ట్ 3708 పేజీవీక్షణలు - 116 పోస్ట్‌లు, చివరగా Apr 17, 2014న ప్రచురించబడింది 

No comments:

Post a Comment