కర్ణాటక రాష్ట్రానికి రాజధాని ఐన బెంగుళూరునకు
25 మైళ్ళు దవ్వున ఉన్న పల్లె
"రామ హల్లి"(tumkUru siima).
ఈ పల్లెకు ఒక విశేషం ఉన్నది.
మన ఆంధ్రప్రదేశ్ లో కదిరి వద్ద,
సుప్రసిద్ధమైన తిమ్మమ్మ మర్రి మ్రాను ఉన్నది.
అట్లాగే రామోహల్లి- లో 400 ఏళ్ళ వయస్సు కలిగిన
మఱ్ఱి వృక్షం ఉన్నది.
స్థానికులు "దొడ్డ అలద మర"
(Ramohalli's 'Dodda Alada Mara') అని పిలుస్తారు.
టూరిస్టులు చూడ దగిన గొప్ప తరువు ఇది.
!!!!!!!!
రామ పల్లె సమీపములో ఉన్న
"ముక్తినాగ దేవళము"ప్రసిద్ధి కెక్కినది.
కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోవెలకు వెళ్ళలేని వారికి
అందుబాటులో ఉన్న నాగదేవతా క్షేత్రము ఇది.
"సర్పదోష నివారణకై భక్తులు పూజించే దైవము" నెలకొని ఉన్న గుడి
ఈ 'ప్రాచీన ముక్తి నాగ ఆలయము'.
No comments:
Post a Comment