Wednesday, June 29, 2016

తమాలపల్లవ శుక, శారికలు

నింగి అడపం నిండా: నీరదం పత్రాలు :
ఆ మబ్బు ఆకులను మడిచి,
           ఇచ్చేవారు ఎవ్వరమ్మా!?
గొబ్బున ఇచ్చు వారెవరమ్మా!? ||
;
తమలపాకు చిలకలను చేయు
చాతుర్యాలు ఎవ్వారివమ్మా?
;
చెలులు :- ఇంకెవ్వరివమ్మా!?
ఇంకెవ్వరికున్నది ఆ ప్రజ్ఞ, ఆ నేర్పు!?
- మన రాధకు తప్ప! ||
;
మెరుపుల వక్కలను సమకూర్చినది వనిత ;
వర్షధార "కాచు" రుద్ది; జలజముల "కిళ్ళీలను" ;
అలవోకగ చేసేను అపరంజి బొమ్మ
;                     మన అపరంజి బొమ్మ ||
;
శ్రావణ మేఘాల విడియాలు సిద్ధం, సిద్ధం ;
కర్పూరం తాంబూలం సిద్ధం, సిద్ధం ;
కోమలి కుడి చేతి వ్రేళ్ళ శిఖరములుగ;
తమాల పల్లవం బొమ్మలు ; సిద్ధం, సిద్ధం ;
ఎర్రెర్రని పెదవుల గూటిలోన దాచేటి ;
మురళీధర! నందబాల!
మా నల్లనయ్య! రావయ్యా! ||

=========================,

#nimgi aDapam nimDA: nIradAla patrAlu :
aa mabbu aakulanu maDichii; ichchE
wArewarammA!?
gobbuna ichchE wArewarammA!? ||
;
tamalapaaku chilakalanu;
chEsE chaaturyaalewwariwammaa?
imkewwariwammaa!?
;
imkewwari kunna damma aa praj~na, A nErpu!?
mana raadhaku tappa! ||
;
merupula wakkalu nu samakuurchinadi wanita;
wEsi; warshadhaara kaachu ruddi; jalajamula "kiLLIlanu" ;
alawOkaga chEsEnu ; mana aparamji bomma ||
;
SraawaNa mEGAla wiDiyaalu siddham, siddham ;
karpuuram taambuulam siddham, siddham ;
kOmali kuDi chEti wrELLa SiKaramuluga;

tamaala pallawam
bommalu ; siddham, siddham ;
errerrani pedawula; gUTilOna daachETi ;
muraLIdhara! namdabaala!
maa nallanayya! raawayyaa! ||
;
[ తమాలపల్లవ శుక, శారికలు ]

''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
; రాధామనోహరం (శ్రీ కృష్ణ భావలహరి) ; October 3, 2015; 
అఖిలవనిత
Pageview chart 36180 pageviews - 870 posts, last published on Jun 25, 2016 - 

ksm - another song - :-

ముల్లోకములకు పారవశ్యము ;-
మంజుల వాణీ! శార్వాణీ! 
పినాక పాణి, హృదయ రాణివి! 
అమ్మా! నీ ఒడిలోన. ముల్లోకములు మైమరచేను! ||
అమ్మా! నీ తమాల పల్లవ కటాక్ష దృక్కుల 
ముల్లోకములు మైమరచేను! || 
తుషార మౌక్తిక ధవళ కాంతులు/ లను

No comments:

Post a Comment