Sunday, May 18, 2014

చూడండి! ఓ అమ్మణీ!


తడబడెడు అడుగులతొ 
అడుగులే వేశాడు, 
చిన్ని క్రిష్ణమ్మ!;
పద్మాలు విరిసాయి ఆ అడుగులో||

అడుగడుగొ అతడేనె అల్లరి క్రిష్ణుడు;
మారాములన్ మేటి, గారాల క్రిష్ణుడు; 

అడుగుదాము రండి; 
ఆకతాయీ పనులు మానుకొమ్మనుచూను ||  

చేతులతొ నీటిలో: తపతపలు, 
కొట్టుచూ ఆటలే ఆడాడు, చిలిపి క్రిష్ణయ్య 
శంఖులే నీటిపై తేలి వచ్చాయి ||

చిరు నగవు విరియగా “అమ్మత్త” పలికాడు; 
తొక్కు లే పలుకుల్ల 
పగడాల పూవులే విరబూసినాయి ||                     

పుట్టచాటున నక్కి; దొంగాటలాడాడు; 
ఆదిశేషుని వేయి పడగల పైన 
మరకతమ్ముల ద్యుతులు, 
మిరుమిట్లు గొలిపేను, ఓ అమ్మలాల! 
కనుల మిరుమిట్లు గొలిపేను,  ॥ 

చెట్టు కొమ్మల ఎక్కి, వెక్కిరించాడు, కొక్కిరించాడు;
"కొక్కిరాయీ!" అనుచు పిలిచారు భామినులు;
అలుక బూని కన్న; బుంగమూతిని పెట్టి 
పొన్న కొమ్మల నెక్కి బాగ కూర్చున్నాడు, 
వెన్నముద్దలు తెండి! ఓ అమ్మలాలా! 
కినుకను మాన్పిస్తేను, తులిపి బాలకుడు ఆ
కు గుబురులనుండి, ఇట్టె దిగి వస్తాడు, 
మా మురిపాల చిన్ని క్రిష్ణమ్మ ||

పద్మములు, శంఖములు విరిసియున్నట్టి;
పదములతొ తడబడెడు అడుగులే వేసాడు, 
చిన్ని క్రిష్ణమ్మ! మా ముద్దు క్రిష్ణయ్య ||

*******************************,


taDabaDeDu aDugulato; aDugulE wESADu, chinni krishNamma!;
padmaalu wirisaayi , aa aDugulO||

chEtulato nITilO: tapatapalu, koTTuchU ATalE ADADu/
SamKulE niiTipai tEli wachchaayi ||

chiru nagawu wiriyagaa ammatta palikaaDu; 
pagaDAla puuwulE wirabUdinaayi ||

puTTachaaTuna nakki; domgaaTalADADu; 
aadiSEshuni wEyi paDagala paina marakatammula dyutulu, 
kanula mirumiTlu golipEnu, chuuDamDi! O ammalaala! 
cheTTu kommala ekki, wekkirimchaaDu, kokkirimchaaDu;
"kokkiraayii!" anuchu pilichaaru bhaaminulu;
aluka buuni kanna; ponna komma nekki kuurchunnaaDu, 
wennamuddalu temDi! O ammalaalaa! kinukanu maanpiste, 
aaku guburulanumDi, iTTe digi wastaaDu, maa muripaala ||

padmamulu, SamKamulu wirisiyunnaTTi;
padamulato taDabaDeDu aDugulE wEsaaDu, ||

No comments:

Post a Comment