Sunday, January 3, 2010

హఠము - బైఠాయింపు





naadu svapnamulepuDu -
niMgini saMchariMchu chuMDu;
chUDu ! chUDu!
vaani tuMTari vyaapakamula !
"nitya vyaahyaaLulanu
sEyuchunE uMDunu kadaa sadaa "!

naadu, aa kammanaina kalala haMsa naDalu
rOdasii baaTalanniMTi niMDA
'vinuutna suruchira
svapna pushpa makaraMda rajanulatODa;
sRjiyiMchenu SRti subhaga saMgiita mELanamulan ;
kiMpurusha lOkasthulipuDu ;
aame nagavula sOpaana paMktulan ;
naDachi vachchinaaru nEDu!-

I diviki digi vachchi, yaksha,
kinneralu, gaMdharva, divyulella ;

"viMta gunnavi ; kala kaMThi svapna gItula -
manOj~na saMgiita laharul !
unna paaTuna maaku nErpumii
varusa maTlu, saMgiita baaNIla"nanuchu ;
haThamu sEyuchu naa vadda iTula;
baiThaayiMchiri ;
tega haThamu sEstuu!
Emi sEyaM gala vaaDa ;
nEnu ipuDu!

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

నాదు స్వప్నములెపుడు -
నింగిని సంచరించు చుండు
చూడు ! చూడు! వాని తుంటరి వ్యాపకముల !
"నిత్య వ్యాహ్యాళులను సేయుచునే ఉండును కదా సదా "!
నాదు ఆ కమ్మనైన కలల హంస నడలు
రోదసీ బాటలన్నింటి నిండా
'వినూత్న సురుచిర స్వప్న
పుష్ప మకరంద రజనులతోడ;
సృజియించెను శృతి సుభగ సంగీత మేళనములన్ ;
కింపురుష లోకస్థులిపుడు ;
ఆమె నగవుల సోపాన పంక్తులన్ ;
నడచి వచ్చినారు నేడు!-
ఈ దివికి దిగి వచ్చి,
యక్ష, కిన్నెరలు, గంధర్వ, దివ్యులెల్ల ;

"వింత గున్నవి ;
కల కంఠి స్వప్న గీతుల మనోజ్ఞ సంగీత లహరుల్ !
ఉన్న పాటున మాకు నేర్పుమీ
వరుస మట్లు, సంగీత బాణీల"ననుచు ;

హఠము సేయుచు నా వద్ద ఇటుల; బైఠాయించిరి ;
తెగ హఠము సేస్తూ!
ఏమి సేయం గల వాడ ;
నేను ఇపుడు!

No comments:

Post a Comment