Friday, January 22, 2010

నిండు పున్నమి


1. అగచాట్లు పెట్టకోయి! చంద మామా!
దిగి రావోయ్, దబ్బున "రేయి నింగిలోనికి"!

2. రేయి కాస్త "అమావాస్య" నీవు లేక!
"నిండు - పున్నమి"గా మార్చేను' నీదు రాక ' !

3.వెన్నెలమ్మ పడవలోన దర్శనముల నీయవోయి!
భీతి, బెరుకు లెందుకోయి, చంద మామ!
అందిస్తానులే నీకు “ పాప నవ్వు చుక్కాని”ని!
హాయిగా సాగించుము నీ నౌకా యానం


Baala

నిండు పున్నమి

By kadambari piduri, Jan 10 2010 10:22PM

Thursday, January 14, 2010

ఒట్టు తీసి గట్టు మీద

-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-





ఉట్టి మీద దాపరికం - గుమ్మ పాలు, నవ నీతం
పాలకుండ దొంతులను - "ఉత్తుత్తినె దాచామని"
పల్లె పడుచుల బొంకులు - చిలిపి ఊసులతొ నత్తులు

తరిపి పాల వెన్న ముద్ద్దలను ఇట్టే పసికట్టినట్టి
యశోదా సుతుని వద్ద - సాగేనా ఈ ఒత్తులు?

అరరే! ఆగ్రహించిన తల్లి ఎదుట -
చిన్నారి గారాల బాలుడే కద అతడెపుడూ!
రెండు చెవులు మెలి పెట్టి -
బుద్ధి సుద్దులెన్నిటినో - గరిపెనదీ యశోదమ్మ.

"ఒత్తులుగా, దీర్ఘాలుగ ఆయెనయ్యో - మెలి పెట్ట బడిన
కన్నయ్య సుకుమారపు చెవులయ్యో!"
అనుచు, తల్లడిలుచు - అందరునూ
బాల కృష్ణు లాలిస్తూ హత్తు కొనిరి

"ఒట్టి మాట ! గట్టి ఒట్టుల"న్నిటినీ
ఇట్టె గట్టు మీద పెట్టితి"మని అన్నారు
గడ్డ పెరుగుతో పాటుగ - తమ, ప్రేమలను రంగరిస్తూ
వెన్న ముద్ద,మీగడలను - కన్నయ్యకు తినిపించిరి

(Baala

ఒట్టు తీసి గట్టు మీద

By kadambari piduri, Nov 28 2009 12:42AM

Tuesday, January 12, 2010

రామ చిలుక తెలుపుమా!




పలుకవే చిలుకా! పలకవే చిలకా!
ఇన్నిన్ని అలుకలు నీకెందుకే చెప్పు! ||

రామ చంద్రులతొ ఎపుడు
నేస్తము కడితివే?
"రామ చిలుక"ను
ముద్దు - పేరు పొందావు ? ||

పలుకు పలుకున తేనె
నింపుకోవే చిలుక!
కుశలవ బాలురకు
కుశలములు తెలుపుమా! ||

రామ చిలుక
By kadambari piduri, Dec 27 2009 3:19PM

Wednesday, January 6, 2010

కదంబమాల




మరువ జాలమయా
నీ మురిపెముల చేతలు
యశోదా వత్సలా!
దేవకీ తనూజా! ||

లలిత కళా దీప్తి
ఈ - ఇలకు అందించినావు
నాకమునే తల దన్నెను
ఈ పృధ్వి నీ కతముననే! ||

నీ - పల్లవాంగుళులందు మురళి
రాగ మాల ,మరువములూ,
దవనాల కదంబముల మాల ||

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

kadambari piduri, Dec 24 2009 7:22AM

Tuesday, January 5, 2010

వాల్మీకి రచించిన " శ్రీ సరస్వతీ స్తోత్రము"

SrI vaalmiiki rachiMchinaTTi "SrI sarasvatii dEvi stOtram "; ii " vaaNI praSaMsa "brahmaaMDa puraaNamu " lO upalabdhamu.

1.SarachchaMdra vaktraaM; lasatpadma hastaaM - sarOja nEtraaM sphuradratna mauLIm :::::
ghanaakaara vENii M, niraakaara vRttiM ; bhajE SAradAM vaasaraa piiTha vaasaam^ ::::: -

2. dharaa bhaara pOshaaM suraaniika vaMdyaaM,mRNALI lasad baahu kEyUra yuktaam^ :trilOkaika saakshii mudaara stanaadhyaaM ;bhajE SAradaaM ~~~

3. duraasaara saMsaara tiirdhaaMghri pOtaaM ; kvaNat^ svarNa maaNikya haaraabhi raamaam^ | SarachchaMdrikaa dhauta vaasOlasaMtiiM, bhajE ~~~ ||

4. viriMchii vishNviMdra yOgIMdra puujyaaM, prasannaaM vipannaartinaaSAM SaraNyaam^ : trilOkaadhi naathaadhi naathaaM triSUnyAM ; bhajE ~~~ ||

5. anaMtaa magamyaa manaadyaa mabhaavyaa mabhEdyaa madaahyaa malEpyaa marUpaam^ : aSOshyaa masaMgA madEhaa mavaachyaaM , bhajE ~~~ ||

6. manO vaagatiitaa manaamnI makhaMDA mabhinnaatmikaa madvayaaM sva prakaaSaam^: chidaanaMda kaMdaaM paraM jyOti ruupaaM; bhajE ~~~ ||

sadaanaMda ruupaaM SubhaayOga rUpaa ~ maSEshaatmikaaM nirguNAM nirvikaaraam^ | mahaa vaakya vEdyaaM vichaara prasaMgaaM bhajE ~~~ ||

8. imaM stavaM paThEdvastu trikaalaM bhakti saMyuta@h ; SAradaa saumya maapnOti gRhEsthitvaaj~na saMbhavam^ || _

OM tatsat^
iti SrI brahmaaMDa puraaNAMtargata,
vaalmiiki kRta SrI vaasara sarasvatI stOtraM, saMpUrNam^.


[ # Lekhini.org"#lO Taipu chEya baDinadi.]

శ్రీ వాల్మీకి రచించినట్టి "శ్రీ సరస్వతీ దేవి స్తోత్రం ";
ఈ " వాణీ ప్రశంస "బ్రహ్మాండ పురాణము " లో ఉపలబ్ధము.

1. శరచ్చంద్ర వక్త్రాం; లసత్పద్మ హస్తాం - సరోజ నేత్రాం స్ఫురద్రత్న మౌళీం :::::
ఘనాకార వేణీo, నిరాకార వృత్తిం ; భజే శారదాం వాసరా పీఠ వాసాం :::::-

2. ధరా భార పోషాం సురానీక వంద్యాం ,మృణాళీ లసద్ బాహు కేయూర యుక్తాం :
త్రిలోకైక సాక్షీ ముదార స్తనాధ్యాం భజే శారదాం వాసరా పీఠ వాసాం :::::

3. దురాసార సంసార తీర్ధాంఘ్రి పోతాం ; క్వణత్ స్వర్ణ మాణిక్య హారాభి రామాం |
శరచ్చంద్రికా ధౌత వాసోలసంతీం, భజే శారదాం వాసరా పీఠ వాసాం ||

4. విరించీ విష్ణ్వింద్ర యోగీంద్ర పూజ్యాం, ప్రసన్నాం విపన్నార్తినాశాం శరణ్యాం :
త్రిలోకాధి నాథాధి నాథాం త్రిశూన్యాం; భజే శారదాం వాసరా పీఠ వాసాం ||
5. అనంతా మగమ్యా మనాద్యా మభావ్యా మభేద్యా మదాహ్యా మలేప్యా మరూపాం :
అశోష్యా మసంగా మదేహా మవాచ్యాం , భజే శారదాం వాసరా పీఠ వాసాం ||

6. మనో వాగతీతా మనామ్నీ మఖండా మభిన్నాత్మికా మద్వయాం స్వ ప్రకాశాం:
చిదానంద కందాం పరం జ్యోతి రూపాం; భజే శారదాం వాసరా పీఠ వాసాం ||

సదానంద రూపాం శుభాయోగ రూపా ~ మశేషాత్మికాం నిర్గుణాం నిర్వికారాం |
మహా వాక్య వేద్యాం విచార ప్రసంగాం భజే శారదాం వాసరా పీఠ వాసాం ||

8. ఇమం స్తవం పఠేద్వస్తు త్రికాలం భక్తి సంయుతః ;
శారదా సౌమ్య మాప్నోతి గృహేస్థిత్వాజ్ఞ సంభవం ||
_ ఓం తత్సత్ _

ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత,
వాల్మీకి కృత శ్రీ వాసర సరస్వతీ స్తోత్రం, సంపూర్ణం.

[Lekhini.org"లో టైపు చేయ బడినది.]

Sunday, January 3, 2010

హఠము - బైఠాయింపు





naadu svapnamulepuDu -
niMgini saMchariMchu chuMDu;
chUDu ! chUDu!
vaani tuMTari vyaapakamula !
"nitya vyaahyaaLulanu
sEyuchunE uMDunu kadaa sadaa "!

naadu, aa kammanaina kalala haMsa naDalu
rOdasii baaTalanniMTi niMDA
'vinuutna suruchira
svapna pushpa makaraMda rajanulatODa;
sRjiyiMchenu SRti subhaga saMgiita mELanamulan ;
kiMpurusha lOkasthulipuDu ;
aame nagavula sOpaana paMktulan ;
naDachi vachchinaaru nEDu!-

I diviki digi vachchi, yaksha,
kinneralu, gaMdharva, divyulella ;

"viMta gunnavi ; kala kaMThi svapna gItula -
manOj~na saMgiita laharul !
unna paaTuna maaku nErpumii
varusa maTlu, saMgiita baaNIla"nanuchu ;
haThamu sEyuchu naa vadda iTula;
baiThaayiMchiri ;
tega haThamu sEstuu!
Emi sEyaM gala vaaDa ;
nEnu ipuDu!

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

నాదు స్వప్నములెపుడు -
నింగిని సంచరించు చుండు
చూడు ! చూడు! వాని తుంటరి వ్యాపకముల !
"నిత్య వ్యాహ్యాళులను సేయుచునే ఉండును కదా సదా "!
నాదు ఆ కమ్మనైన కలల హంస నడలు
రోదసీ బాటలన్నింటి నిండా
'వినూత్న సురుచిర స్వప్న
పుష్ప మకరంద రజనులతోడ;
సృజియించెను శృతి సుభగ సంగీత మేళనములన్ ;
కింపురుష లోకస్థులిపుడు ;
ఆమె నగవుల సోపాన పంక్తులన్ ;
నడచి వచ్చినారు నేడు!-
ఈ దివికి దిగి వచ్చి,
యక్ష, కిన్నెరలు, గంధర్వ, దివ్యులెల్ల ;

"వింత గున్నవి ;
కల కంఠి స్వప్న గీతుల మనోజ్ఞ సంగీత లహరుల్ !
ఉన్న పాటున మాకు నేర్పుమీ
వరుస మట్లు, సంగీత బాణీల"ననుచు ;

హఠము సేయుచు నా వద్ద ఇటుల; బైఠాయించిరి ;
తెగ హఠము సేస్తూ!
ఏమి సేయం గల వాడ ;
నేను ఇపుడు!

కోలాటములకు పునాది!


రేపల్లె గళములోన - చేరెను ' రోహిణి తారక '
శ్రావణాల పట్టీ - అష్టమిలో పుట్టీ
ఏమి సందడీ - ఈ గోకులాష్టమి!

మారు మూల పల్లెలోన - జోరు జోరు పాటలు
వ్రేపల్లియ ఐనది - కోలాటమాట పునాది!

వెన్నెల కిరణాల్లార! - ప్రత్యూషా రేఖలార!
చేయి చేయి కలుపుకునీ - జారి, జారి, ఇలకు రండి!
మీ పెన వేసిన కిరణాలు నేర్చు- కోలాటము లాటలను !